రిస్క్ ఎందుకని.. మళ్లీ డీవీడీనే నమ్ముకుంటున్న సమంత

Published : Jul 13, 2019, 01:56 PM ISTUpdated : Jul 13, 2019, 01:57 PM IST
రిస్క్ ఎందుకని.. మళ్లీ డీవీడీనే నమ్ముకుంటున్న సమంత

సారాంశం

సమంత, నందిని రెడ్డిల కలయికలో వచ్చిన మొదటి చిత్రం ‘జబర్దస్త్’. 

సమంత, నందిని రెడ్డిల కలయికలో వచ్చిన మొదటి చిత్రం ‘జబర్దస్త్’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత  చాలా గ్యాప్ తీసుకుని వీరిద్దరూ కలిసి ‘ఓ బేబీ’ సినిమా చేశారు. ఈసారి హిట్ అవటం వీళ్లద్దరికి కలిసి వచ్చింది. రిలీజైన మొదటిరోజు మార్నింగ్ షోకే  సినిమా హిట్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లను రాబడుతోంది.  ఈ ఉత్సాహంతోనే వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేయాలని డిసైడ్ అయ్యారట. అందులో ఆశ్చర్యమేమీ కూడా లేదు. 

అయితే ఈ సారి ఓ ఫ్రెంచ్ క్రైమ్ కామెడీ ని చేద్దామని సమంత ఫిక్స్ అయ్యిందట. ఇప్పటికే ఆ డీవిడిని నందినీ రెడ్డి ఇచ్చి , తెలుగు కోసం చేసే మార్పులు , చేర్పులు చెప్పిందిట. అదీ ఫుల్ ఫన్ తో నడిచే రివేంజ్ టైప్ క్రైమ్ డ్రామా అని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలోనూ హీరో లేడట. పూర్తిగా హీరోయిన్ ఓరియెంటెడ్ కథే అంటున్నారు. అయితే ఆ సినిమా టైటిల్ ఏంటనేది మాత్రం తెలియలేదు. 

‘ఓ బేబీ’షూటింగ్ సమయంలోనే నదిని రెడ్డి సమంతకు ఈ క్రైమ్ కథ  వినిపించారట. అది నచ్చిన సమంత తప్పకుండా చేద్దాం అని మాటిచ్చారట. ఇప్పుడు ‘ఓ బేబీ’ హిట్టైంది కాబట్టి వీరి కాంబో పై ప్రేక్షకుల్లో అంచనాలతో పాటు మార్కెట్లో డిమాండ్ కూడా ఉంది. ఈ వేడి తగ్గకముందే వీళ్లిద్దరూ సినిమా చేయాలని భావిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ వార్తలు నిజమై త్వరలోనే వీరు కొత్త సినిమాను ప్రకటిస్తారని మీడియా ఎదురుచూస్తోంది. 

 

PREV
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు