శాంతించండిః `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వివాదంపై స్పందించిన సమంత..

Published : May 21, 2021, 05:54 PM IST
శాంతించండిః `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వివాదంపై స్పందించిన సమంత..

సారాంశం

తమిళ నెటిజన్లు సమంత టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. సామ్‌కి వ్యతిరేకంగా, అలాగే `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వెబ్‌సిరీస్‌కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది. 

`ది ఫ్యామిలీ మ్యాన్‌2` వెబ్‌ సిరీస్‌ వివాదం ఇప్పుడు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. ముఖ్యంగా సమంతని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు నెటిజన్లు. తమిళ నెటిజన్లు సమంత టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. సామ్‌కి వ్యతిరేకంగా, అలాగే `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వెబ్‌సిరీస్‌కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే, ``ఫ్యామిలీ మ్యాన్ 1` కు  కొనసాగింపుగా రూపొందిన  వెబ్ సిరీస్‌ `ఫ్యామిలీ మ్యాన్ 2`.  ఈ సిరీస్ లను దర్శకులు రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. మొదటి భాగంలో నటించిన మనోజ్ భాజ్ పాయ్, ప్రియమణిలతో పాటు సెకండ్ సిరీస్ లో అక్కినేని సమంత  కీలక పాత్రల్లో కనిపించారు. 

ఇటీవల ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ విడుదలైంది. అది కాంట్రవర్షియల్‌గా మారింది.  ఈ ట్రైలర్‌లో కొన్ని సీన్లు తమిళుల మనోభావాలను కించపరిచేవిగా ఉన్నాయని సోషల్ మీడియాలో తమిళులు విరుచుకుపడ్డారు. ఈ సిరీస్‌కి వ్యతిరేకంగా `ఫ్యామిలీ మ్యాన్-2 ఎగైనెస్ట్ తమిళ్` అనే హాష్‌ ట్యాగ్‌ను వైరల్‌ చేశారు. తమిళుల కోసం పోరాడిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంకి ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ట్రైలర్ లో చూపించడం దారుణం అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. శ్రీలంకలో తమిళ వాసుల కోసం, హక్కుల కోసం పోరాడిన ఎల్‌టీటీఈ అసలు టెర్రరిస్ట్ సంస్థే కాదని, సామ్ తమిళ నటి అయ్యి కూడా ఇలాంటి పాత్రలో నటించడం ఏంటంటూ సోషల్ మీడియా వేదికగా సామ్‌పై ఫైర్‌ అయ్యారు. 

దీంతో దిగొచ్చిన అమెజాన్‌ ప్రైమ్‌ ట్రైలర్‌ని రీఎడిట్ చేసిన యూట్యూబ్‌లో మళ్లీ రిలీజ్‌ చేసింది. ఈ ట్రైలర్‌లో సమంతకు సంబంధించిన కొన్ని సీన్లకు కత్తెర వేసి తమిళ తంబీలను శాంత పరిచే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సమంత కూడా తాజాగా స్పందించింది. `శాంతించండి, ప్రశాంతంగా ఉండండి. నిజం ఉన్నది` అని మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ కొటేషన్‌ని పంచుకుంది. సమంత చెప్పిన దాని ప్రకారం సినిమాలో ఎల్‌టీటీఈకి సంబంధించిన సన్నివేశాలు తొలగిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇది వెబ్‌ సిరీస్‌ విడుదలయ్యాక గానీ ఈ వివాదం ఎలాంటి మలుపుతు తీసుకుంటుందో అర్థమవుతుంది. ఇది జూన్‌ 4న అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కాబోతుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు