కష్టకాలంలో చేయూత.. మంచు లక్ష్మీ, రేణూ దేశాయ్ లను మెచ్చుకోవాల్సిందే!

By team teluguFirst Published May 21, 2021, 3:19 PM IST
Highlights

ప్రముఖులు ఆహారం, మెడిసిన్, ఆక్సిజెన్, హాస్పిటలైజేన్ కరోనా బాధితులకు సమకూర్చుతున్నారు. కాగా మేము సైతం అంటూ ఈ సేవలో పాలు పంచుకున్నారు మంచు లక్ష్మీ, రేణూ దేశాయ్.

కరోనా కష్టకాలంలో అనేక ఇబ్బందులు పడుతున్న రోగులు, పేదలు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, పోలీస్ సిబ్బంది కోసం ప్రముఖులు చేతనైన సాయం చేస్తున్నారు. ఆహారం, మెడిసిన్, ఆక్సిజెన్, హాస్పిటలైజేన్ సమకూర్చుతున్నారు. కాగా మేము సైతం అంటూ ఈ సేవలో పాలు పంచుకున్నారు మంచు లక్ష్మీ, రేణూ దేశాయ్. 


 మంచు లక్ష్మీ కరోనా విధులలో పాల్గొంటూ ఆహారానికి ఇబ్బంది పడుతున్న పోలీస్ సిబ్బందికి ఆహారం సరఫరా చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలో పనిచేస్తున్న 50మంది పోలీసులకు ఆమె వారం రోజులుగా ఆహారం పంపిస్తున్నారు. తన నివాసంలో భోజనం తయారు చేసివారికి చేరవేస్తున్నారు. 


మరోవైపు రేణూ దేశాయ్ ఇంస్టాగ్రామ్ ద్వారా కరోనా బాధితుల నుండి సందేశాలు అందుకొని వారికి అవసరమైన మెడిసిన్, ఆక్సిజన్, వైద్యం సమకూర్చుతున్నారు. కొన్ని ఎన్జీవో సంస్థలతో కలిసి రేణూ దేశాయ్ ఈ మంచి కార్యక్రమం నెరవేరుస్తున్నారు. చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతాల నుండి అభ్యర్థనలు అందుకొని సాధ్యం అయినంత వరకు వారి అవసరాలు తీర్చుతున్నారు.
 

click me!