షాకింగ్‌ న్యూస్‌.. సమంత మూడేళ్లుగా గర్భవతి అట..

Published : Aug 29, 2020, 04:47 PM IST
షాకింగ్‌ న్యూస్‌.. సమంత మూడేళ్లుగా గర్భవతి అట..

సారాంశం

తాజాగా సమంత ఇన్‌ స్టాగ్రామ్‌లో `ఆస్క్ సమంత` పేరుతో అభిమానులతో చాటింగ్‌ నిర్వహించింది. సమంతని నెటిజన్లు `మీరు తల్లి ఎప్పుడు కాబోతున్నారు?` అని అడగ్గా, సమంత కొంటెగా సమాధానం చెప్పింది.

హీరోయిన్లకు సోషల్‌ మీడియాలో కొన్నిసార్లు విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతుంటాయి. కొందరు కొంటే ప్రశ్నలు అడుగుతుంటారు. మరికొందరు వల్గర్‌ కామెంట్‌ చేస్తుంటారు. అన్నింటిని సంయమనంతో భరిస్తూ, ఓపికగా వాళ్ళకి సమాధానం చెబుతుంటారు. అలాంటి ప్రశ్నే సమంతకి ఎదురయ్యింది. అందుకు ఆమె చెప్పిన సమాధానం షాక్‌కి గురి చేస్తుంది. 

తాజాగా సమంత ఇన్‌ స్టాగ్రామ్‌లో `ఆస్క్ సమంత` పేరుతో అభిమానులతో చాటింగ్‌ నిర్వహించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుకుంటూ వస్తోంది. ఇటీవల బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ తాను గర్బవతి అని, వచ్చే ఏడాది తల్లిని కాబోతున్నట్టు ప్రకటించి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసింది. 

దీంతో ఇప్పుడు సమంతని నెటిజన్లు అదే ప్రశ్నని అడిగారు. `మీరు తల్లి ఎప్పుడు కాబోతున్నారు?` అని అడగ్గా, సమంత కొంటెగా సమాధానం చెప్పింది. తాను 2017 నుంచే గర్భవతినే అని, బేబీ బయటకు రావాలనుకోవడం లేదనుకుంటా అని సెటైర్‌ వేసింది. దీంతో అభిమానులు, నెటిజన్లు అవాక్కయ్యారు. 

ఈ ఏడాది ప్రారంభంలో `జాను` చిత్రంతో అలరించిన సమంత ఇంకా కొత్తగా మరే ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు. దీంతో ప్రస్తుతం సమంత పిల్లలను కనేందుకు ప్లాన్‌ చేసుకుంటుందేమో అనే వార్తలొస్తున్నాయి. మరోవైపు సమంత తెలుగులో నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది. తమిళంలో ఓ సినిమాకి కమిట్‌ కాగా, దాన్నుంచి అర్థంతరంగా తప్పుకుందని టాక్‌.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి