సమంత టైమ్‌ స్టార్ట్.. `శాకుంతలం` ఫస్ట్ సింగిల్‌ `మల్లికా` వచ్చేది అప్పుడే..

Published : Jan 17, 2023, 12:46 PM IST
సమంత టైమ్‌ స్టార్ట్.. `శాకుంతలం` ఫస్ట్ సింగిల్‌ `మల్లికా` వచ్చేది అప్పుడే..

సారాంశం

ఆ మధ్య `యశోద`తో అందరిని అలరించింది  సమంత. ఇప్పుడు మరోసారి రచ్చ చేసేందుకు వస్తుంది.  ఆమె నటించిన `శాకుంతలం` సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. 

మరోసారి ఇండియన్‌ తెరపై సమంత రచ్చ చేసేందుకు వస్తుంది. ఆ మధ్య `యశోద`తో అందరిని అలరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి రచ్చ చేసేందుకు వస్తుంది. ఆమె నటించిన `శాకుంతలం` చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. దీనికి విశేష స్పందన రాబట్టింది. 

ఇక ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ  చేస్తున్నారు. మొదటి పాటని విడుదల చేయబోతున్నారు. `మల్లికా` అంటూ సాగే పాటని రేపు విడుదల చేయబోతున్నారు. తెలుగు, కన్నడ, హిందీలో ఇది `మల్లికా`గా, తమిళంలో `మల్లిగా` గా, మలయాళంలో `మల్లికే` గా విడుదల కాబోతుంది. `శాకుంతలం` తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. 

ఈ మేరకు ఓ అదిరిపోయే పోస్టర్‌ని రిలీజ్‌ చేసింది యూనిట్‌. ఇందులో ఇందులో శాకుంతలగా సమంత లుక్‌ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. గోపికలను తలపించేలా ఉంది సామ్‌. అందం అదరహో అనేలా దేవకన్యలా మతిపోగొడుతుంది. ఈ పోస్టర్‌ రచ్చ చేస్తుంది. పోస్టర్‌తోనే కాదు,  ఇప్పుడు సమంత కూడా కంటిన్యూగా నెల రోజులపాటు సందడి చేయబోతుందని, మరోసారి సమంత టైమ్‌ స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. 

సమంత.. శకుంతలగా నటించే ఈ చిత్రంలో దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు. మోహన్‌బాబు, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని గుణటీమ్‌ వర్క్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, నీలిమా గుణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న విడుదల కాబోతుంది. ఎపిక్‌ లవ్‌ స్టోరీ నేపథ్యంలో మైథలాజికల్‌గా ఈ చిత్రం  రూపొందుతుంది. శాకుంతలం, దుష్యంతుడి ప్రేమ ప్రధానంగా సినిమా సాగుతుందని చె

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?