రైటర్ గా దిల్ రాజు బ్యానర్ లోవచ్చిన సినిమాలతో కెరీర్ మొదలెట్టిన బాబీ.. డైరెక్టర్ గా పవర్ సినిమాతో దద్దరిల్లిపోయే హిట్ కొట్టారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టైన సంగతి తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సంక్రాంతి విన్నర్ ఈ చిత్రమే అని తేలిపోయింది. ఇప్పటికే 'మాస్ బ్లాక్ బస్టర్ మీట్' ను నిర్వహించారు. వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు ఎక్కడ చూసిన బాబీ పేరు మారుమ్రోగుతోంది. మెగాభిమానులు బాసును ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించి సక్సెస్ అయ్యారు డైరెక్టర్ బాబీ అంటున్నారు. చిరంజీవి సైతం బాబిని తెగ మెచ్చుకుంటున్నారు. ఈ నేపధ్యంలో బాబి తదుపరి ఏ హీరోతో చేయబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.
అందుతున్న సమాచారం మేరకు బాబి తన తదుపరి చిత్రం సితార ఎంటర్ట్మెంట్ బ్యానర్ కు కమిటయ్యారు. బాలయ్య హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే అందుకు సమయం పట్టనుంది. ఈ విషయమై అధికారిక ప్రకటన అయితే రాలేదు.
ఇక బాబి కెరీర్ విషయానికి వస్తే... రైటర్ గా దిల్ రాజు బ్యానర్ లోవచ్చిన సినిమాలతో కెరీర్ మొదలెట్టిన బాబీ.. డైరెక్టర్ గా పవర్ సినిమాతో దద్దరిల్లిపోయే హిట్ కొట్టారు. ఆ తర్వాతే స్టార్ హీరోల సినిమాలు చేస్తూ.. స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఇక ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరుతో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. కాని దీనికి ఇంకాస్త అడిషనల్ మ్యాటర్ ఏంటంటే.. కేవలం చిరును డైరెక్టర్ చేసేందుకే బాబీ డైరెక్టర్ అయ్యారు. సినిమాల్లోకి వచ్చారు. ఇక వీరయ్య సినిమాతో ఆ ఎయిమ్ కంప్లీట్ చేసుకున్నారు.
దర్శకుడు బాబీ మాట్లాడుతూ .. "ఈ సినిమా థియేటర్స్ కి వెళ్లాము .. అక్కడి రెస్పాన్స్ చూసిన తరువాత, మేము పడిన కష్టాన్ని మరిచిపోయాము. ఇంతకుముందు తీసిన సినిమాలకు నాకు పేరు మాత్రమే వచ్చింది. ఈ సినిమా వలన నాకు గౌరవం వచ్చింది" అని అన్నాడు. అలాగే "నేను అనుకున్నట్టుగానే ఈ సినిమా పూనకాలు తెప్పిస్తోంది. రిలీజ్ కి ముందే ఈ సినిమాపై మాకు నమ్మకం కలగడానికి కారణం దేవిశ్రీ ప్రసాద్. అందరూ కూడా సాంగ్స్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు లైఫ్ ఇచ్చిన రవితేజ గారు ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్లు అంతా కూడా నాకు కాల్ చేసి, పండక్కి ఇది పెర్ఫెక్ట్ సినిమా అంటూ ఉంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పుకొచ్చాడు.