సమంత కొత్త జర్నీ ప్రకటన.. ఎలాంటి సినిమాలు చేయబోతుందంటే?

Published : Dec 11, 2023, 09:22 AM IST
సమంత కొత్త జర్నీ ప్రకటన.. ఎలాంటి సినిమాలు చేయబోతుందంటే?

సారాంశం

సమంత ఇప్పటి వరకు హీరోయిన్‌గా రాణించింది. పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకుంది. ఇప్పుడు కొత్త జర్నీని స్టార్ట్ చేయబోతుంది. ఆ విషయాన్ని ప్రకటించింది. 

సమంత స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. పెళ్లైన తర్వాత కూడా ఆమె హీరోయిన్‌గా బిజీగానే ఉంది. టాలీవుడ్‌లో టాప్‌ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న హీరోయిన్‌గా నిలిచింది. ఆమె రెండేళ్ల క్రితం తన విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. సింగిల్‌గా ఉన్న సమంత సినిమాల జోరు మాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఆ తర్వాత అనారోగ్యంతో బాధపడిన సమంత.. దాన్నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఇప్పుడు కొంత గ్యాప్‌ తీసుకుంది. రెస్ట్ లో రెట్టింపు ఎనర్జీని, ఉత్సాహాన్ని పొందుతుంది. ఇప్పుడు తిరిగి కమ్ బ్యాక్‌ అవుతుంది. 

అయితే తాజాగా తన అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. లేటెస్ట్ గా ఆమె కొత్త జర్నీ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుంది. లేటెస్ట్ గా ఆమె ప్రొడక్షన్‌ హౌజ్‌ని ప్రారంభించింది. ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్ పేరుతో ప్రొడక్షన్‌ హౌజ్‌ని స్టార్ట్ చేసింది సమంత. ఆదివారం ఈ విషయాన్ని ఆమె ప్రకటించింది. తనకిష్టమైన ఇంగ్లీష్‌ పాప్‌ సాంగ్‌ `బ్రౌన్‌ గర్ల్ ఇన్‌ ది రింగ్‌` అనే పాట నుంచి ఇన్‌స్పైర్‌ అయి ఈ తన సొంత ప్రొడక్షన్‌కి పేరుపెట్టినట్టు సోషల్‌ మీడియా మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటించింది సమంత. 

ఇక తన ప్రొడక్షన్‌లో తాను ఎలాంటి సినిమాలు చేయబోతుందో వెల్లడించింది సామ్‌. కొత్త తరం ఆలోచనలను ఎంకరేజ్‌ చేస్తామని చెప్పింది. న్యూ ఐడియాస్‌, కంటెంట్‌ బేస్డ్ చిత్రాలను చేస్తానని వెల్లడించింది. మన సామాజంలోని సంక్లిష్టతలను, బలాల గురించి తెలిపే కథలను నిర్మించబోతున్నట్టు, అలాంటి సినిమాలను ప్రొడ్యూస్‌ చేస్తానని ఆమె తెలిపింది. అర్థవంతమైన, యూనివర్సల్‌, ప్రామాణికమైన కథలను చెప్పాలనుకుంటున్నట్టు ఆమె సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. 

సమంత ప్రొడక్షన్‌ అనౌన్స్ చేయగానే యంగ్‌ మేకర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నారు. యంగ్‌ మేకర్స్ ని ప్రోత్సహించాలని చెబుతున్నారు. మరికొందరు తమ వద్ద మంచి కథలున్నాయంటూ తమని ఎంకరేజ్‌ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక సమంత  చివరగా `ఖుషి` చిత్రంలో నటించి హిట్‌ అందుకుంది. హిందీలో `సిటాడెల్‌` వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఇది విడుదల కావాల్సింది. మరి  ఇప్పుడు ఆమె కమ్‌ బ్యాక్‌కి ప్లాన్‌ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి ఏ సినిమాతో రాబోతుందనేది చూడాలి. 

Read more: సమంతని చూసి కేకలు పెట్టిన `ప్రత్యూష` స్టూడెండ్స్.. అరుపులతో హోరెత్తిపోయిన ఏఎంబీ..
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

నమ్రత ఎంత చెప్పినా వినకుండా డిజాస్టర్ చూసిన మహేష్ బాబు ? ఆ సినిమా చేసి తప్పు చేశాడా?
Eesha Rebba: డైరెక్టర్‌ని పెళ్లి చేసుకోబోతున్న ఈషా రెబ్బా.. అసలు కథ ఇప్పుడే స్టార్ట్