సమంతని చూసి కేకలు పెట్టిన `ప్రత్యూష` స్టూడెండ్స్.. అరుపులతో హోరెత్తిపోయిన ఏఎంబీ..

Published : Dec 10, 2023, 11:15 PM IST
సమంతని చూసి కేకలు పెట్టిన `ప్రత్యూష` స్టూడెండ్స్.. అరుపులతో హోరెత్తిపోయిన ఏఎంబీ..

సారాంశం

సమంత తాజాగా ఏఎంబీ మల్టీ ఫ్లెక్స్ లో సందడి చేశారు. `హాయ్‌ నాన్న` సినిమా  స్పెషల్‌ స్క్రీనింగ్‌లో మెరిశారు. అయితే ఆమె ఆర్గనైజేషన్‌ పిల్లలు పాల్గొని రచ్చ చేశారు.

సమంత ఇంత కాలం రెస్ట్ లో ఉన్న విషయం తెలిసిందే. ఆమె అరోగ్యం మెరుగుపడేందుకు కొంత గ్యాప్ తీసుకుంది. సినిమాల నుంచి దూరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మళ్లీ సందడి చేస్తుంది. ఇటీవల ఆమె సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంది.ఇప్పుడు హైదరాబాద్‌లోనూ హంగామా చేస్తుంది. ఆమె తాజాగా మహేష్‌బాబు మల్టీఫ్లెక్స్ `ఏఎంబీ`లో సందడి చేసింది. `హాయ్‌ నాన్న` సినిమా స్పెషల్‌ షో వీక్షించేందుకు వచ్చింది. 

సమంత నిర్వహిస్తున్న ప్రత్యుష ఎన్జీఓ కి చెందిన పిల్లలకు ఈ ప్రత్యేక షోని ప్రదర్శించారు. దీంతో తన ఆర్జనైజేషన్‌కి చెందిన పిల్లలంతా ఇందులో పాల్గొన్నారు. ఈ షోకి సమంత గెస్ట్ గా రావడం విశేషం. అంతేకాదు తన సంస్థ కావడంతో ఆమె కూడా ఈ స్క్రీనింగ్‌కి వచ్చారు. అయితే సమంతని చూసిన పిల్లలంతా అరుపులతో హోరెత్తించారు. సమంతని చూసిన ఆనందంలో వారంతా కంటిన్యూగా అరవడంతో సమంత సైతం ఆనందం తట్టుకోలేకపోయింది. దీంతో ఏఎంబీ మల్టీఫ్లెక్స్ మొత్తం హోరెత్తిపోయింది. కాసేపు దద్దరిల్లింది. అనంతరం వీరంతా కలిసి `హాయ్‌ నాన్న` సినిమాని వీక్షించారు. 

నాని, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన `హాయ్‌ నాన్న` చిత్రం గురువారం విడుదలైంది. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్‌, లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. శౌర్యువ్‌ అనే నూతన దర్శకుడు రూపొందించారు.ఈ మూవీకి మిశ్రమస్పందన లభించింది. వీకెండ్‌ లో కాస్త బెటర్‌గా రాణిస్తుంది. పెద్దగా ఇతర సినిమాలు లేకపోవడంతో దీనికి కొంత వరకు ఆడియెన్స్ వస్తున్నారు. మరి రేపటి నుంచి దీనికి ఎలాంటి రియాక్షన్‌ ఉంటుందనేది చూడాలి. 

ఇక సమంత చివరగా `ఖుషి` సినిమాలో నటించింది. విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందిన చిత్రమిది. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ మూవీ మంచి ఆదరణ పొందింది. ఆమె గత సినిమాలు అంతగా మెప్పించకపోవడంతో `ఖుషి`తో రిలాక్స్ అయ్యింది. ఇప్పుడు ఆమె రెస్ట్ లో ఉన్నారు. ఏడాది పాటు తాను సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్టు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె యాక్టివ్‌గా మారిన నేపథ్యంలో మళ్లీ సినిమాలతో బిజీ కాబోతుందని తెలుస్తుంది. ఇక సమంత హిందీలో నటించిన `సిటాడెల్‌` వెబ్‌ సిరీస్‌ విడుదల కావాల్సి ఉంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్