జిమ్‌ ఫోటో షేర్‌ చేసిన సమంత.. సిక్స్ ప్యాక్స్ కోసమా ఇంతటి శ్రమా?.. సెలబ్రిటీల కామెంట్లు

Published : Mar 20, 2023, 03:13 PM IST
జిమ్‌ ఫోటో షేర్‌ చేసిన సమంత.. సిక్స్ ప్యాక్స్ కోసమా ఇంతటి శ్రమా?.. సెలబ్రిటీల కామెంట్లు

సారాంశం

సమంత కోల్పోయిన ఫిట్‌నెస్‌ని తిరిగి పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. అందులో భాగంగా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుంది. తాజాగా ఆమె పంచుకున్న జిమ్‌ ఫోటో ఆకట్టుకుంటుంది.

సమంత.. లేడీ సూపర్‌ స్టార్‌ మారుతోంది. సమంత బ్యాక్‌ టూ బ్యాక్‌ స్ట్రగుల్స్ నుంచి బయటపడుతూ తనని తాను స్ట్రాంగ్‌ గా మలుచుకుంటుంది. ఓ వైపు మానసికంగా, మరోవైపు శారీరకంగా ఆమె బలంగా తయారవుతుంది. మహిళగా నిలబడేందుకు, నటిగా వరుస సినిమాల్లో నటించేందుకు సమంత సిద్ధమవుతుంది. సమంత చేతిలో వరుసగా సినిమాలున్నాయి. ఓ వెబ్‌ సిరీస్‌, ఓ మూవీ చేస్తుంది. మరో రెండు మూడు ప్రాజెక్ట్ లు పట్టాలెక్కాల్సి ఉంది. మయో సైటిస్‌ వ్యాధి నుంచి కోలుకుని బయటపడ్డ సమంత పోయిన ఫిట్‌నెస్‌ని పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. జిమ్‌లో చెమటోడుస్తుంది. 

ఇటీవల చాలా వరకు జిమ్‌లోనే కష్టపడుతుంది సమంత. మరింత బలంగా, ఫిట్‌గా తయారయ్యేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా ఈ స్టార్‌ హీరోయిన్‌ మరో ఫోటోని పంచుకుంది. ఇందులో ఆమె జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న ఫోటోని పంచుకుంది. ఫ్లోర్‌పై రెండు మోచేతులపై ఉండి స్టమక్‌ ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంది. నడుము, ముఖ్యంగా పొట్టభాగంలో ఉన్న కొవ్వుని కరిగించేందుకు కష్టపడుతుంది. అయితే ఈ యాంగిల్‌లో చూస్తుంటే ఆమె సిక్స్ ప్యాక్‌ కనిపించేలా ఉంది. దీంతో సోషల్‌ మీడియాలో స్పందిస్తున్నారు సెలబ్రిటీలు, నెటిజన్లు. 

ఇందులో బిగువైన బ్రా(వర్కౌట్‌ టాప్‌) ధరించింది. ఫ్రీగా ఉండే ప్యాంట్‌ వేసుకుంది. ఓ వైపు గ్లామర్‌ షో చేస్తూనే మరోవైపు ఫిట్‌నెస్‌ కోసం చెమటోడ్చడం ఆశ్చర్యపరుస్తుంది. ఇది చూసిన సెలబ్రిటీలు స్పందిస్తూ సమంతకి మరింత ఎనర్జీనిచ్చే పోస్టులు పెడుతున్నారు. ఇలానే కొనసాగాలని, మరింత బలంగా మారాలని, సమంత మోస్ట్ స్ట్రాంగ్‌ అని పోస్ట్ లు పెడుతున్నారు.  ఇందులో హీరోయిన్‌ శ్రియా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌,  వంటి వారు స్పందిస్తూ స్ట్రాంగ్‌ గర్ల్‌ అని ఎంకరేజ్‌ చేస్తున్నారు. ఈ ఫోటోని పంచుకున్న ఏడు గంటల్లోనే ఏకంగా ఎనిమిది లక్షలకుపైగా వ్యూస్‌ రావడం విశేషం. సమంత ఫాలోయింగ్‌కిది నిదర్శనంగా చెప్పొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతకి 25 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నాయి. అంటే సుమారు రెండున్నర కోట్ల మంది ఈ బ్యూటీని ఫాలో అవుతున్నారని చెప్పచ్చు. 

ఇక మయో సైటిస్‌ నుంచి కోలుకున్నాక వరుసగా సినిమాల షూటింగ్‌లో పాల్గొంటుంది సమంత. ఆ మధ్య హిందీలో `సిటాడెల్‌` రీమేక్‌ లో నటించింది. ఇప్పుడు విజయ్‌ దేవరకొండతో `ఖుషి` చిత్రం చేస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. దీంతోపాటు ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీ `శాకుంతలం` విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం వచ్చే నెల 14న రిలీజ్‌ కానుంది. ఇందులో దేవ్‌ మోహన్‌, మోహన్‌బాబు, అల్లు అర్హ, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. గుణశేఖర్‌ దర్శకత్వం వహించారు. నిలిమా గుణ, దిల్‌ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు ఓ ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్ కి కూడా సమంత సైన్‌ చేసింది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

అఖండ 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్, బాలయ్యకు భారీ షాక్, గతవారం రిలీజైన 6 సినిమాల రిపోర్ట్ సంగతేంటి?
Bigg Boss 9 Telugu: తనూజ చరిత్ర మాకు తెలుసు, కళ్యాణ్ ని గెలిపించండి.. యష్మీ, శ్రీసత్య షాకింగ్ కామెంట్స్