అలియాభట్‌కి ఫిదా అయిన సమంత.. మాటలు లేవంటూ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్

Published : Feb 27, 2022, 07:45 PM IST
అలియాభట్‌కి ఫిదా అయిన సమంత.. మాటలు లేవంటూ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్

సారాంశం

స్టార్‌ హీరోయిన్‌ సమంత.. తాజాగా అలియాభట్‌కి ఫిదా అయ్యింది. `గంగూబాయి` సినిమా చూసి ఆమెని అభినందించకుండా ఉండలేకపోయింది. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో అప్రిషియేట్‌ చేస్తూ పోస్ట్ పంచుకుంది.

సమంత(Samantha) బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టింది. ఆమె నటించిన `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వెబ్‌ సిరీస్‌ బాలీవుడ్‌లో మంచి పేరుని, గుర్తింపుని తీసుకొచ్చింది. ప్రస్తుతం అక్కడి నుంచి తనకు ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ రాణించాలనే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. హిందీ చిత్రాలపై స్పందిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం సమంత.. `ఆర్‌ఆర్‌ఆర్‌` హీరోయిన్‌ అలియాభట్‌(Alia Bhatt)పై ప్రశంసలు కురిపించింది. ఆమె నటనని అప్రిషియేట్‌ చేయడానికి మాటలు రావడం లేదని తెలిపింది. 

అలియాభట్‌ నటించిన లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం `గంగూబాయిః కఠియవాడి`(Gangubai Movie) ఫిబ్రవరి 25న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి ప్రశంసలందుతున్నాయి. ఆడియెన్స్ కూడా బాగా ఆదరిస్తున్నారు. తొలి రోజు ఈ చిత్రం పదికోట్లు వసూలు చేసింది. రోజు రోజుకి మరింతగా పుంజుకుంటూ దూసుకుపోతుంది. కరోనా కారణంగా సినిమాలను జనం ఆదరిస్తారా? అనే భయాందోళన నడుమ విడుదలైన `గంగూబాయి` మంచి ఆదరణతో దూసుకుపోతుంది. థియేటర్లలో క్రౌడ్‌ ఫుల్లింగ్‌గా నిలుస్తుంది. ఓ రకంగా బాలీవుడ్‌కి ధైర్యాన్నిచ్చింది. 

మరోవైపు ఈ చిత్రంలో గంగూబాయిగా Alia Bhatt నటన ప్రశంసలందుకుంటుంది. వేశ్యగా ఆలియా నటన అద్భుతంగా ఉందంటూ బాలీవుడ్‌ మీడియా అభినందిస్తుంది.  తాజాగా సమంత స్పందించింది. ఆమె నటనని ప్రశంసించింది. ``గంగూబాయిః కఠియావాడి` ఒక కళాఖండం. అలియా మీ నటన గురించి వివరించడానికి పదాలు సరిపోవడం లేదు. ప్రతీ ఒక్క డైలాగ్, హావాభావాలు నా మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి` అంటూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పేర్కొంది సమంత. తాజాగా సమంత స్టోరీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

బాలీవుడ్‌లో అద్భుతమైన కళాఖండాలు తెరకెక్కించే సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన `గంగూబాయిః కఠియవాడి` చిత్రంలో టైటిల్‌ రోల్‌ అలియాభట్‌ చేయగా, అజయ్‌ దేవగన్‌, ఇమ్రాన్‌ యాష్కి, హ్యూమా ఖురేషి కీలక పాత్రలు పోషించారు. ముంబయి మాఫియా క్వీన్‌ గంగూబాయి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదిలా ఉంటే సమంత సైతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో `శాకుంతలం`, `యశోద` చిత్రాలు చేస్తుంది. మరోవైపు డ్రీమ్‌ వారియర్స్ ప్రొడక్షన్‌లోనూ ఓ సినిమా చేయనుంది. ఓ ఇంటర్నేషనల్‌ మూవీ చేయనుంది. బాలీవుడ్‌లోనూ సినిమాలు చేయబోతుందని టాక్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు