సమంత.. క్యారెట్లు తిని బతికేస్తదేమో?

Published : Aug 25, 2020, 03:34 PM ISTUpdated : Aug 25, 2020, 03:51 PM IST
సమంత.. క్యారెట్లు తిని బతికేస్తదేమో?

సారాంశం

ఇప్పుడు ఏకంగా తమ ఇంట్లో పండించిన క్యారెట్లని చూపిస్తూ ఓ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది సమంత. అంతేకాదు కొంటెగా ఓ పోస్ట్ పెట్టింది. ఈ వారం మెనూ అంటూ క్యారెట్లతో చేయబోతున్న లిస్ట్ నే పంచుకుంది. 

`ఈ వారం మెనూ.. క్యారెట్‌ జ్యూస్‌, క్యారెట్‌ పచ్చడి, క్యారెట్‌ హల్వా, క్యారెట్‌ వేపుడు, క్యారెట్‌ పకోడి, క్యారెట్‌ ఇడ్లీ, క్యారెట్‌ సమోసా` అని క్యారెట్లతో చేసుకోబోయే వంటల లిస్ట్ నే పంచుకుంది సమంత. స్టార్‌ హీరోయిన్‌ ఈ క్యారెట్ల గొడవేంటనేది డౌట్‌ రావచ్చు. ఆ సంగతులు తెలుసుకుంటే ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతారు. 

సమంత.. నాగచైతన్యని పెళ్ళి చేసుకున్నాక, ఫ్యామిలీ లైఫ్‌ పై బాగా దృష్టి పెట్టింది. తమ ఇంట్లోనే ఫామింగ్‌ చేస్తుంది. ఆధునిక పద్ధతిలో కూరగాయలను పండిస్తుంది. ఇంట్లో కావాల్సిన ప్రతి ఐటెమ్‌ని తానే స్వయంగా సమంత పండిస్తుందట. ఇటీవలే ఈ విషయాన్ని సామ్‌ పంచుకుంది. కొంత కాలం ఎవరికి వారు ఇంట్లోనే ఆహారం పండించుకోవాలి అంటూ `గ్రో విత్‌ మీ` అనే ఛాలెంజ్‌కి తెరలేపింది. రకుల్‌, మంచు లక్ష్మీలను కూడా నామినేట్‌ చేసింది. కానీ వారి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. 

ఇప్పుడు ఏకంగా తమ ఇంట్లో పండించిన క్యారెట్లని చూపిస్తూ ఓ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది సమంత. అంతేకాదు కొంటెగా ఓ పోస్ట్ పెట్టింది. ఈ వారం మెనూ అంటూ క్యారెట్లతో చేయబోతున్న లిస్ట్ నే పంచుకుంది. ఈ వారం మొత్తం క్యారెట్లతో బతికేస్తామని పరోక్షంగా చెప్పింది. దీంతో నెటిజన్లు సైతం షాక్‌కి గురవుతున్నారు. సమంత్‌కి తగ్గట్టుగానే ఇక క్యారెట్లు తిని బతికేయండి అంటూ సెటైరికల్‌గా పోస్ట్ లు పెడుతున్నారు. 

ఈ ఏడాది ప్రారంభంలో `జాను` సినిమాలో మెరిసిన సమంత కొత్తగా అధికారికంగా ఇంకా ఏ సినిమాని ప్రకటించలేదు. తమిళంలో ఓ సినిమా, తెలుగులో ఓ సినిమా చేయబోతున్నట్టు టాక్. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు