అనుకున్న డేట్ కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చిన శాకుంతలం,

Published : May 11, 2023, 11:35 AM IST
అనుకున్న డేట్ కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చిన శాకుంతలం,

సారాంశం

సమంత ప్రధాన పాత్రను పోషిస్తూ.. గుణశేఖర్ దర్శకత్వంలో..దిల్ రాజు నిర్మించిన సినిమా శాకుంతలం. అసినిమా ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యి.. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఓటీటీల్లోకి కూడా అనుకున్న డేట్ కంటే ముందే స్ట్రీమింగ్ అయ్యి ఆశ్చర్యపరిచింది.  

రెండుమూడేళ్ళు.. విశ్రాంతి లేకుండా.. భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు శాకుంతలం సినిమాను. శకుంతలగా సమంత, దుశ్యంతుడిగా మలయాళ యంగ్ స్టార్ దేవ్ మోహన్. చిన్నారి భరతుడిగా అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హా. ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు లా చాలామంది సీనియర్లు నటించి సినిమా శాకుంతలం. ఏప్రి14న రిలీజ్ అయిన ఈసినిమా మొదటి రోజు నుంచే నెగెటీవ్ టాక్ ను తెచ్చుకుంది. ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించి.. ప్రమోషన్స్ ను కూడా భారీ ఎత్తున నిర్వహించారు మేకర్స్ ..కాని లాభం లేకుండాపోయింది. 

రాజమౌళిని చూసి చాలా మంది దర్శకుడు క్రియేటివిటీకి పనిచెపుతున్నారు. వారి డ్రీమ్ ప్రాజెక్ట్స్ గా ఉన్న చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలను తెరకెక్కిస్తున్నారు. కాని  రాజమౌళి క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ ని అందుకోలేకపోతున్నారు. ఇందులో మణిరత్నం పొన్నియన్ సెల్వన్ తో పాటు.. తాజాగా వచ్చిన గుణశేఖర్ శాకుంతలం  సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఈరెండు సినిమాల విషయంలోనూ సేమ్ సీన్ రిపీటైంది. చాలా ఇబ్బందులు దాటుకుని గత నెలలో థియేటర్లలోకి వచ్చిన శాకుంతలం సినిమా... ఇప్పుడు నెలకూడా తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేసింది. 

ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది శాకుంతలం. అయితే ముందుగా మేకర్స్ ప్రకటించాలి అనుకున్న డైట్ ప్రాకారం కాకుండా.. ముందుగానే స్క్రీమింగ్ అయ్యి.. అందరిని ఆశ్చర్యపరిచింది శాకుంతలం సినిమా. మే 12 నుంచి  ఈసినిమాను స్ట్రీమింగ్ చేస్తారని అనుకున్నారు అంతా.. కాని చెప్పిన టైమ్ కంటే ముందే అంటే మే 11న ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చేసింది శాకుంతలం. 

శాకుంతలం సినిమా ధారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను తీస్తే..  కేవలం 4 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇది గుణశేఖర్ కు తగిలిన మరో గట్టి దెబ్బగా తెలుసుకోవచ్చు. అంతే కాదు సినిమాను అంచనా వేయడంతో తాను పొరపాటు పడ్డట్టు.. మేకుర్స్ ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

Kalyan Padala తో వర్కౌట్‌ కాకపోవడంతో డీమాన్‌ పవన్‌ని పట్టుకుంది.. ట్రోల్స్ పై రీతూ చౌదరీ రియాక్షన్‌ ఇదే
BBK 12 Finale: బిగ్ బాస్ ప్రకటించకముందే విన్నర్ పేరు లీక్ చేసిన వికీపీడియా.. విజేత ఎవరో తెలుసా?