రిలీజ్ కి ముందు 'శాకుంతలం'కి ఎదురుదెబ్బ.. అక్కడ షోలు క్యాన్సిల్, సామ్ ఫ్యాన్స్ కి కీలక అప్డేట్  

Published : Apr 13, 2023, 09:59 PM IST
రిలీజ్ కి ముందు 'శాకుంతలం'కి ఎదురుదెబ్బ.. అక్కడ షోలు క్యాన్సిల్, సామ్ ఫ్యాన్స్ కి కీలక అప్డేట్  

సారాంశం

సమంత నటిస్తున్న శాకుంతలం చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఏప్రిల్ 14న శాకుంతలం చిత్రం గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది.

సమంత నటిస్తున్న శాకుంతలం చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఏప్రిల్ 14న శాకుంతలం చిత్రం గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. సమంత కెరీర్ లో ఇది తప్పకుండా ఒక ప్రత్యేక చిత్రం. పౌరాణిక చిత్రంగా దుశ్యంతుడు, శకుంతల ప్రేమ కథని దర్శకుడు గుణశేఖర్ ఆవిష్కరించబోతున్నారు.

పౌరాణిక చిత్రంలో సమంత తొలిసారి ఎలా నటించింది.. గుణశేఖర్ తన ప్రత్యేకత చాటుకున్నారా అనే విషయాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, టీజర్స్ లో సమంత శకుంతలగా గ్లామర్ గా కనిపించింది. అయితే రిలీజ్ కి ముందు శాకుంతలం చిత్రానికి ఎదురుదెబ్బ తగిలింది. 

శుక్రవారం ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న తరుణంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో శాకుంతలం షోలు రద్దయ్యాయి. ఆ ప్రాంతంలో తెలంగాణ ప్రభుతం డా. బిఆర్ అంబేత్కర్ స్టాట్యూని ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14న అంబేత్కర్ జయంతి సందర్భంగా స్టాట్యూ ప్రారంభోత్సవం జరగనుంది. దీనితో ప్రసాద్స్ లో ఏప్రిల్ 14 షోలు రద్దు చేశారు. ఇది రేపటి వరకు మాత్రమే. ఏప్రిల్ 15 నుంచి అన్ని షోలు యథావిధిగా ప్రదర్శించబడుతాయి. 

ఈ కీలక అప్డేట్ ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఇతర థియేటర్స్ లో శాకుంతలం చిత్రాన్ని ఎంజాయ్ చేయాలని అభిమానులని చిత్ర యూనిట్ కోరింది. ప్రసాద్ ఐమాక్స్ అనేది ఎలాంటి చిత్రానికి అయినా చాలా కీలకం. మొదటి షోలకు మంచి పబ్లిసిటీ దక్కేది ఇక్కడి నుంచే. అలాంటి చోట శాకుంతలం రిలీజ్ డే షోలు రద్దు కావడం నిరాశపరిచే అంశమే. 

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్