సమంత హనీమూన్ ఎన్ని రోజులో తెలుసా...

Published : May 23, 2017, 05:46 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
సమంత హనీమూన్ ఎన్ని రోజులో తెలుసా...

సారాంశం

అక్టోబర్ లో నాగచైతన్యతో సమంత  వివాహ ముహూర్తం పెళ్లి వేడుక ముగిశాక చాలా రోజులపాటు హనీమూన్ ప్లాన్స్   పెళ్లికి ముందు, వెనక లు కలిపి మూడు నెలలు విరామం

అక్కినేని వారసుడు నాగచైతన్యతో పెళ్లి ఖరారయ్యాక చెన్నై చిన్నది సమంత చుట్టూనే రకరకాల కథనాలతో వార్తలు ప్రచారమవుతున్నాయి. తాజాగా వార్త ఏమిటంటే పెళ్లి సందర్భంగా సమంత మూడు నెలలు నటనకు విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన వివాహం తర్వాత కూడా నటించేందుకు మొగ్గు చూపుతున్న సమంత.. నటనంటే ప్రాణంగా భావిస్తానని ప్రకటించింది. ఇక సమంత, నాగచైతన్యల పెళ్లికి అక్టోబర్‌ 6వ తేదీన ముహూర్తం కూడా ఖరారైంది.

 

దీంతో ఇప్పటి నుంచే తన వివాహ వేడుకలకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న సమంత... తమ వివాహ తంతు నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ సోమవారం నాడు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంది. పెళ్లి అనంతరం నటనను కొనసాగించాలని నిర్ణయించుకున్న సమంత వివాహానికి ఒక నెల ముందు, ఆ తరువాత మరో రెండు నెలలు కలిపి మూడు నెలలు నటనకు విరామం ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

సమంత ప్రస్తుతం  చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది. తెలుగులో రామ్ చరణ్,సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత..తన కాబోయే మామ నాగార్జునతో కలిసి రాజుగారి గది– 2 చిత్రంతో పాటు, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న మహానటి చిత్రంలోనూ, తమిళంలో విజయ్‌తో ఆయన 61వ చిత్రంలోనూ, శివకార్తికేయన్‌తో మరో చిత్రం, అనీతికథైగళ్‌ అనే ఇంకో చిత్రంలోనూ నటించనుంది. వీటిలో విజయ్‌కు జంటగా నటించనున్న చిత్రానికి వచ్చే నెల నుంచి కాల్‌షీట్స్‌ కేటాయించిందని సమాచారం.

 

అయితే అక్టోబర్ లో వివాహం తర్వాత శివకార్తికేయన్ చిత్రం చేస్తుందా లేదా? అనీతి కథైగళ్‌ చిత్రానికి ముందు ప్రైయారిటీ ఇస్తుందా? లేక ఈ రెండు చిత్రాలను పెళ్లి తరువాతే అంటూ పెండింగ్ లో పడేస్తుందా?అన్నది ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి