సమంత నిర్మాతగా 'త్రాలాలా మూవింగ్ పిక్చర్స్' నుంచి వస్తున్న 'శుభం' టీజర్ విడుదలైంది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ ఆసక్తికరంగా ఉంది, ఇందులో కొత్త పెళ్లి జంట మధ్య జరిగే ఫన్నీ సన్నివేశాలు, ట్విస్ట్ ప్రధానంగా ఉన్నాయి.
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆమె ప్రొడక్షన్ హౌస్ ‘త్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పతాకం నుంచి తొలి చిత్రంగా ‘శుభం’ వస్తోంది. రీసెంట్గా ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వచ్చింది. శుభం చిత్రానికి సినిమాబండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీలో హర్షిత్ రెడ్డి, శ్రీయా కొంతం, గవిరెడ్డి శ్రీనివాస్ లీడ్ రోల్స్ చేశారు. ఉగాది కానుకగా శుభం సినిమా టీజర్ వదిలారు. శుభం టీజర్ ఇంట్రెస్టింగ్‍గా సాగింది. మీరూ ఓ లుక్కేయండి.
ఈ టీజర్ లో కొత్త పెళ్లి కొడుకు (హర్షిత్ రెడ్డి), పెళ్లి కూతురు శ్రీవల్లి (శ్రీయా) శోభనం గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. “మా వాడు అమాయకుడు, మొత్తం నువ్వే చూసుకోవాలని మీ అమ్మ చెప్పారు” అని అతడితో శ్రీవల్లి అంటుంది. తాను ధైర్యవంతుడినని చెప్పేందుకు డైలాగ్‍లు చెబుతాడు హర్షిత్. ఇంతలో రిమోట్ తీసుకొని టీవీ ఆన్ చేస్తుంది అమ్మాయి. దీంతో ట్విస్ట్ ఎదురవుతుంది.
శోభనం గదిలోనే సీరియల్స్ చూస్తూనే ఉంటుంది శ్రీవల్లి. ఇప్పుడు సీరియల్ చూడడం ఏంటి అని హర్షిత్ అంటే.. ఉష్ అంటూ సీరియస్‍గా అంటుంది శ్రీవల్లి. దీంతో అతడు బెదిరిపోతాడు. టీవీ సీరియల్స్ చూసి భర్తను శ్రీవల్లి ఆటాడుకుంటుందనేలా సీన్స్ ఉన్నాయి. ఆల్ఫా పురుషుడు కాకపోతే భార్య వదిలివెళ్లిపోతుందని హర్షిత్‍ను స్నేహితులు బెదిస్తారు. దీంతో శుభం టీజర్ ముగిసింది.
ఈ మూవీకి ‘చచ్చినా చూడాల్సిందేననే’ ట్యాగ్‍లైన్ కూడా ఉంది. మొత్తంగా ఈ టీజర్ ఇంట్రెస్టింగ్‍గా సాగింది. చూస్తుంటే ఇది ఫన్నీగా ఉంది. హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయనిపిస్తోంది. మీరు కూడా టీజర్ పై ఓ లుక్కేయండి.