'వయసునే ఓడించారు..' నాగ్ పై సమంత కామెంట్!

Published : Aug 30, 2019, 11:29 AM ISTUpdated : Aug 30, 2019, 11:31 AM IST
'వయసునే ఓడించారు..' నాగ్ పై సమంత కామెంట్!

సారాంశం

కింగ్ నాగార్జున 60వ బర్త్ డే వేడుకలు స్పెయిన్ - ఇబిజ లొకేషన్ లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం అక్కినేని నాగచైతన్య - సమంత దంపతులు వారం ముందుగానే ఎగ్జోటిక్ లొకేషన్ ఇబిజకు చేరుకుని అక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు.   

కింగ్ నాగార్జున 60వ పుట్టినరోజు వేడుకలు స్పెయిన్ లో ఇబిజ అనే లొకేషన్ లో ప్లాన్ చేశారు. దీని కోసం సమంత, చైతు వారం ముందే ఇబిజకు చేరుకొని అక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు. అలానే అక్కడ ట్రిప్ ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత.

ఇక తన పుట్టినరోజు నాడు ఫ్యామిలీతో సహా ఇబిజకు చేరుకున్నారు  నాగార్జున. కుటుంబంతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అందులో ఒక ఫోటోలో  నాగార్జున స్మిమ్మింగ్ పూల్ లో చిరునవ్వులు చిందిస్తూ కండల ప్రదర్శన చేస్తున్నాడు. ఈ ఫోటో షేర్ చేస్తూ.. 'మీరు వయసునే ఓడించారు మామ' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఈ ఫోటోతో పాటు సమంత, చైతు, నాగ్, అమల, అఖిల్ కలిసి తీసుకున్న ఫ్యామిలీ ఫోటో కూడా షేర్ చేస్తూ ''మీ ప్రేమ‌కి ధ‌న్య‌వాదాలు. ఎప్ప‌టికి మీ ప్రేమ‌, ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను'' అని నాగ్ మామ చెప్ప‌మ‌న్నారు అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోలను బట్టి అక్కినేని ఫ్యామిలీ ఇబిజలో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారని అర్ధమవుతోంది. 

 

 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం