
నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం సమంత తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లింది. వాళ్ల నాన్న మాటల్లోనూ ఆ విషయం స్పష్టమైంది. అంతేకాదు, తనపై వస్తోన్న రూమర్లపై స్పందిస్తూ కూడా సమంత తనని కొన్నాళ్లపాటు ఒంటరిగా వదిలేయండని పేర్కొంది. అయితే ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది సమంత. ట్రెస్ నుంచి రిలీఫ్ పొందుతుంది.
తాజాగా Samantha పంచుకున్న ఓ వీడియోనే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇందులో టాక్ ఆఫ్ వార్ ఆడుతున్న వీడియోని అభిమానులతో షేర్ చేసింది సమంత. `బ్యూటీఫుల్, క్రేజీ, ఫన్, నా స్నేహితులతో విశ్రాంతి లేకుండా ఈ వారం క్షణాల్లో గడిపోయింది` అని తెలిపింది సమంత. స్నేహితులతో ఇలా సరదాగా గడిపినట్టు, వారం కూడా త్వరగా అయిపోయిందని పేర్కొంది సమంత.
అయితే ఇందులోనే ఓ ట్విస్ట్ ఇచ్చింది సమంత. స్వీయ గమనిక అంటూ ఎప్పుడూ గ్రూప్ యాక్టివిటీస్‌లో పాల్గొనవద్దని తెలిపింది. మీరు బాధపడతారు. మీకు బాధ కలుగుతుంది` అని పేర్కొంది. సమంత తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి ఇలా జిమ్‌లో సరదాగా గడపడం విశేషం. ఫిట్‌నెస్, ఉల్లాసాన్ని పొందుతూ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంది సమంత.
సమంత, Naga Chaitanya ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్ల వైవాహిక జీవితం అనంతరం ఈ నెల 2న తాము విడిపోతున్నట్టు ప్రకటించారు. తమ స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ ఇకపై కూడా స్నేహంగానే ఉంటామని తెలిపారు. పెళ్లికి ముందు సమంత, చైతూ విడిపోతున్నట్టు గత మూడు నాలుగు నెలలుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరు విడిపోవడానికి కారణాలు మాత్రం వెల్లడించలేదు.
also read: ఫ్యామిలీ ప్లానింగ్ కోసం షారుక్ మూవీ వదులుకున్న సమంత!
మరోవైపు ఇప్పుడు సినిమాలతో బిజీగా కాబోతుంది సమంత. ఇప్పటికే ఆమె `శాకుంతలం` చిత్రంలో నటించింది. తమిళంలో `కాథు వాకులు రెండు కాదల్` చిత్రంలో నటించింది. ఇటీవల దసరా సందర్భంగా కొత్తగా మరో రెండు సినిమాలను ప్రకటించింది. ఇకపై సమంత పూర్తి స్థాయిలో కెరీర్‌పై ఫోకస్ పెట్టబోతున్నట్టు తెలుస్తుంది.