ఆ హీరోయిన్ తో చైతు లిప్ లాక్.. సమంత రియాక్షన్!

Published : Mar 20, 2019, 04:59 PM IST
ఆ హీరోయిన్ తో చైతు లిప్ లాక్.. సమంత రియాక్షన్!

సారాంశం

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'మజిలీ' సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ నిర్వాన డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో చైతుకి భార్య సమంత కనిపించనుంది.

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'మజిలీ' సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ నిర్వాన డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో చైతుకి భార్య సమంత కనిపించనుంది. అలానే మరో హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్ కనిపించనుంది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ లో నటి దివ్యాంశకి, చైతుకి మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉంది. మరి దీనిపై సమంత ఎలా రియాక్ట్ అయిందంటే.. నటనలో ఇవన్నీ భాగమని చెప్పింది. చైతుకి, తనకు మధ్య అధ్బుతమైన బంధం ఉందని.. తామిద్దరం మంచి స్నేహితులమని  చెప్పింది.

నటనకు, నిజానికి మధ్య చిన్న గీత ఉంటుందని.. ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం కూడా నటనలో భాగమని చెప్పింది. గతంలో 'రంగస్థలం' సినిమాలో సామ్, చరణ్ కి లిప్ లాక్ ఇవ్వడంపై అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

అప్పట్లో సమంత తను కేవలం చరణ్ బుగ్గలపై ముద్దు పెట్టాలని ఆ సీన్ సుకుమార్ కెమెరా ట్రిక్ అని చెప్పింది. ఈసారి తన భర్త లిప్ లాక్ సీన్ పై క్లారిటీ ఇచ్చింది.   

PREV
click me!

Recommended Stories

ఒకే సినిమాలో ముగ్గురు ప్రభాస్ హీరోయిన్లు.. ఒకరిని మించేలా మరొకరు, రెమ్యునరేషన్స్ లో తీవ్ర పోటీ
రజినీ ప్రతి స్టైల్ వెనుక ఇంత కష్టమా? ఆయన పుస్తకంలోని రహస్యాలు!