వెంకీ కూతురు పెళ్లి.. వారికే ఆహ్వానం!

Published : Mar 20, 2019, 04:26 PM IST
వెంకీ కూతురు పెళ్లి.. వారికే ఆహ్వానం!

సారాంశం

దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. వెంకటేష్ కూతురు అశ్రితకి పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ రేస్ క్లబ్ కి అధిపతి ఆర్.సురేందర్ రెడ్డి మనవడిని వెంకీ అల్లుడు చేసుకోబోతున్నాడు. 

దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. వెంకటేష్ కూతురు అశ్రితకి పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ రేస్ క్లబ్ కి అధిపతి ఆర్.సురేందర్ రెడ్డి మనవడిని వెంకీ అల్లుడు చేసుకోబోతున్నాడు. 

ఇటీవల నిశ్చితార్ధం జరగగా.. ఈ వారంలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. రాజస్థాన్ లో పెళ్లి వేడుక జరపనున్నారు. ఈ వివాహ వేడుకకు దగ్గుబాటి కుటుంబానికి చెందినా అత్యంత సన్నిహితులు, టాలీవుడ్ లోని కొందరు ముఖ్యమైన సెలబ్రిటీలకు మాత్రమే ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.

నిశ్చితార్ధం కూడా చాలా సైలెంట్ గా కానిచ్చేశారు. దానికి సంబంధించి ఒక్క ఫోటో కూడా బయటకి రానివ్వలేదు. పెళ్లి విషయంలో కూడా అదే చేయబోతున్నారు. ఇప్పటికే రాజస్థాన్ లోని పెళ్లి ఏర్పాట్లు మొదలైపోయాయి.

సంగీత్ కోసం రానా, చైతు, సమంత హడావిడి చేయడానికి రెడీ అవుతున్నారు. పెళ్లి పూర్తయిన తరువాత హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి మాత్రం టాలీవుడ్. బాలీవుడ్ నుండి సెలబ్రిటీలు అందరూ హాజరవుతారని తెలుస్తోంది.  

PREV
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి