Samantha: `శాకుంతలం` రిలీజ్‌ డేట్‌ ఖరారు.. టార్గెట్‌ ప్రేమికులే?

Published : Jan 02, 2023, 11:55 AM ISTUpdated : Jan 02, 2023, 12:57 PM IST
Samantha: `శాకుంతలం` రిలీజ్‌ డేట్‌ ఖరారు.. టార్గెట్‌ ప్రేమికులే?

సారాంశం

సమంత నటిస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్‌ మూవీ `శాకుంతలం`. ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. 

సమంత గతేడాది `యశోద` చిత్రంతో మెప్పించింది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో ఇది ఓ ప్రత్యేకమైన మూవీగా నిలిచింది. ఇప్పుడు ఆమె నుంచి మరో సినిమా రాబోతుంది. ఎపిక్‌ లవ్‌ స్టోరీతో రాబోతుంది.  పురాణాల నేపథ్యంలో రూపొందుతున్న `శాకుంతలం` చిత్రంలో సమంత నటిస్తుంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. త్రీడీలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి కొత్త సంవత్సరం సందర్భంగా క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. 

`శాకుంతలం` చిత్ర యూనిట్‌ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది. ప్రేమికుల రోజుని, మహాశివరాత్రిని పురస్కరించుకుని సినిమాని విడుదల చేయబోతున్నారు. ఫిబ్రవరి 17న రిలీజ్‌ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఎపిక్‌ లవ్‌ స్టోరీగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అందుకే వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం రిలీజ్‌ చేయబోతుండటం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు సౌత్‌లో, హిందీలోనూ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తుంది యూనిట్‌. 

ఇందులో శాకుంతలగా సమంత, ఆమెకి జోడీగా దుష్యంతుడి పాత్రలో దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు. శాకుంతల, దుష్యంతుడి ప్రేమ కథలోని కొత్త కోణాన్ని ఆశిష్కరించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది. సమంత నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే అంచనాలున్నాయి. అయితే చాలా రోజులుగా దీనికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. కొత్త సంవత్సరం సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు. దీంతో సామ్‌ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ఇందులో సమంతని దేవ్‌ మోహన్‌ హగ్‌ చేసుకుని ఉన్న పోస్టర్‌ రొమాంటిక్‌గా ఆకట్టుకుంటుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో