
తెలుగు అగ్రహీరోయిన్లలో అనుష్క, సమంత, కాజల్ లది టాప్ రేంజ్. అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోపాటు బాహుబలి లాంటి చిత్రాలతో గ్లామర్ కు, నటనకు ప్రాధాన్యత వున్న పాత్రలు చేస్తూ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇటు గ్లామర్, అటు నటనతో టాప్ హిరోయిన్ గా కొనసాగుతోంది అనుష్క. ఇక అనుష్కతోపాటు.. లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేయకుండా.. తమ గ్లామర్ తో టాప్ హీరోలు, కుర్ర హీరోలు అన్న తేడా లేకుండా అద్భుతమైన పాత్రలు దక్కించుకుంటూ.. దూసుకెళ్తున్నారు కాజల్, సమంత.
కాజల్,, సమంత ఇద్దరూ నువ్వా నేనా అన్న రేంజ్ లో పోటీపడుతూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు. అయితే ఇప్పుడు సమంత పెళ్లి చేసుకుంది. అక్కినేని వారి కోడలి హోదా దక్కించుకుని చాలా సంతోషంగా వుంది. సమంతతోపాటు నాగచైతన్య భార్యగా ఆమె అక్కినేని వారింట అడుగు పెట్టిన సందర్భంగా.. ఆ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉందో మరో స్టార్ హీరోయిన్ కాజల్ కూడా అంతే హ్యాపీగా ఉంది.
సమంత పెళ్లి తర్వాత కాజల్ పండగ చేసుకుంటోంది. ప్రస్తుతం సమంత రంగస్థలం, మహానటి చిత్రాల్లో నటిస్తోంది. ఇవి పూర్తయితే సమంతకు ఇప్పుడు చేతిలో పెద్దగా ఆఫర్లేవీ లేవు. ఎప్పుడైతే చైతూతో పెళ్లి అని ప్రకటించిందో.. అప్పుడే ఒక్కసారిగా ఆఫర్లు రావడం తగ్గిపోయింది. అఆ, జనతా గ్యారేజీ, 24 లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇచ్చినప్పటికీ.. నిర్మాతలు ఆమెను సినిమాల్లోకి తీసుకోవడానికి ఆసక్తి చూపట్లేదు. సమంత అంటే అభిమానం చూపే త్రివిక్రమ్ కూడా నాగార్జున కోడలు అనే కారణంతో తన తదుపరి చిత్రాల్లో అవకాశం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. 24, మనం లాంటి సినిమాలు తీసిన విక్రమ్ కూడా అక్కినేని వారి కోడలితో సినిమాకు ఆసక్తి చూపట్లేదు. హిట్లు ఇచ్చినప్పటికీ, పెళ్లయినా సినిమాలు మానేది లేదని చెప్పినప్పటికీ తనకు ఆఫర్లు ఎందుకు రావడం లేదో అని సమంతఫీలవుతోంది.
మరోవైపు కాజల్ ఈ మధ్య బిజీగా మారింది. ఖైదీ నంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి, అజిత్ వివేగం, విజయ్ మెర్సల్ లాంటి సినిమాలతో ఈ ఏడాది వరుసగా హిట్లు కొట్టింది. రేసులోకి రకుల్ వచ్చినా స్పైడర్ తీవ్రంగా నిరాశపర్చించింది. దీంతో నిర్మాతలు కాజల్‌నే తమ సినిమాల్లోకి హీరోయిన్‌గా తీసుకోవాలని ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్థుతం తేజ డైరెక్షన్ లో వెంకటేశ్ హీరోగా రానున్న మూవీలో నటించేందుకు ఓకే చెప్పిన ఈ హీరోయిన్ నందమూరి కల్యాణ్ రామ్‌తోనూ ఎమ్మెల్యే సినిమాలో నటిస్తోంది. ఒకప్పుడు ఆఫర్ల కోసం సమంతతో పోటీ పడిన కాజల్.. ఇప్పుడు మాత్రం తన హవా చాటుతోంది. సమంత పెళ్లితో పండగ చేసుకుంటోంది కాజల్.