సమంత వీడియో చూసి అభిమానులు షాక్!

By AN TeluguFirst Published 23, May 2019, 8:52 AM IST
Highlights

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫిట్ నెస్ కి ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. తన రోజువారీ జీవితంలో జిమ్ కూడా ఒక భాగమే..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫిట్ నెస్ కి ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. తన రోజువారీ జీవితంలో జిమ్ కూడా ఒక భాగమే.. తరచూ ఆమె కసరత్తులు చేస్తుండగా తీసిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

అవి కాస్త వైరల్ గా మారేవి. తాజాగా సమంత వంద కిలోలను లిఫ్ట్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు సమంతను 'ఐరన్ లేడీ' అంటూ కొనియాడారు.

మరికొందరు అసలు ఇది ఇలా చేశావ్ సామ్ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని స్పూర్తిగా తీసుకుంటామంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల సమంత నటించిన 'మజిలీ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ 'ఓ బేబీ' అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. నందిని రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విడుదల చేయనున్నారు.  

 

Last Updated 23, May 2019, 8:52 AM IST