Samantha:లేట్ నైట్ ఎయిర్ పోర్ట్ లో సమంత ఏం చేసిందో చూడండి (వీడియో)

Surya Prakash   | Asianet News
Published : Feb 18, 2022, 08:09 AM IST
Samantha:లేట్ నైట్ ఎయిర్ పోర్ట్ లో సమంత ఏం చేసిందో చూడండి (వీడియో)

సారాంశం

కెరీర్ పరంగా యంగ్ హీరోయిన్లు.. కొత్త హీరోయిన్ల హడావిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేస్తూ తన క్రేజ్ ను ఇంకా పెంచుకుంటూ దూసుకుపోతుంది సమంత.


సమంత విడాకుల విషయం నుంచి మెల్లిగా బయిటకు వస్తోంది. తన జీవితం తనదే అన్నట్లు ఎంజాయ్ చేస్తోంది. గత కొంతకాలంగా నాగచైతన్య…సమంత విడాకుల ప్రకటన ఒక్కసారిగా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యింది. టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ అంటూ పేరు తెచ్చుకున్న ఈ జంట ఇలా ఆకస్మాత్తుగా విడిపోవడం ఏంటని అభిమానులతోపాటు.. సినీ ప్రముఖులు సైతం షాకయ్యారు. అయితే వీరిద్దరి విడాకుల ప్రకటన అనంతరం సమంత పై పూర్తిగా నెగిటివిటి వ్యాప్తి చెందింది.

తన వ్యవహార శైలి నచ్చకపోవడం వలనే చైతూ విడాకులు ఇచ్చారంటూ కొందరు నెట్టింట్లో దారుణంగా ట్రోల్స్ చేశారు. అలాగే సమంత మీద  రకరకాలుగా రూమర్స్ మొదలయ్యాయి. కొందరైతే సమంత అబార్షన్ చేయించుకుందని కూడా కామెంట్స్ చేశారు. అయితే వాటిన్నటిని ధైర్యంగా ఎదుర్కొన్న ఆమె హ్యాపీగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది.

 తాజాగా  సమంత ఓ ఫన్నీ వీడియోని ఇనిస్ట్రాలో షేర్ చేసింది. సమంతకు లేట్ నైట్ ప్లైట్ ఉండటం, చాలా టైమ్ గ్యాప్ ఉండటంతో సరదాగా అరబిక్ కుత్తు పాటకు డాన్స్ చేసి ఇనిస్ట్రాలో పోస్ట్ చేసింది. పాటలోని సిగ్నేచర్ స్టెప్ ని ఆమే వేసి ,దుమ్మురేపింది. రిప్పడ్ జీన్స్ లో అదీ లేట్ నైట్ ఎయిర్ పోర్ట్ లో చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం నిమిషాల వ్యవదిలోనే   వైరల్ గా మారడం జరిగిపోయింది.  క్యాజువల్  స్టెప్ లతో సమంత సింప్లీ సూపర్ అంటూ నెటిజన్లు లైకులు కొట్టి మరీ కామెంట్లు పెడుతున్నారు.మీరూ ఓ లుక్కేయండి.

కెరీర్ పరంగా యంగ్ హీరోయిన్లు.. కొత్త హీరోయిన్ల హడావిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేస్తూ తన క్రేజ్ ను ఇంకా పెంచుకుంటూ దూసుకుపోతుంది సమంత.  సమంత విడాకుల తర్వాత రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సమంత తన తదుపరి చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌తో చేయబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన దసరా సందర్భంగా  విడుదలైంది. కొత్త డైరెక్టర్‌ శాంతరూబన్‌ జ్ఞానశేఖరన్‌ డైరెక్షన్‌లో సమంత ఈ చిత్రాన్ని చేయనున్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?