వినగానే భయపడ్డా.. సమంత కామెంట్స్!

Published : Nov 30, 2018, 02:29 PM IST
వినగానే భయపడ్డా.. సమంత కామెంట్స్!

సారాంశం

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత ఇటీవల 'యూటర్న్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె తన భర్త నాగచైతన్యతో కలిసి 'మజిలీ' సినిమాలో నటిస్తోంది. 

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత ఇటీవల 'యూటర్న్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె తన భర్త నాగచైతన్యతో కలిసి 'మజిలీ' సినిమాలో నటిస్తోంది. ఇది ఇలా ఉండగా తాజాగా ఆమె మరో కొత్త సినిమాకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ''ఇప్పటివరకు నేను చేయని ఓ ఆసక్తికరమైన పాత్రలో నటించడానికి సిద్ధమవుతున్నాను. పాత్ర గురించి తెలుసుకున్న తరువాత నేను చాలా భయపడ్డాను. ఇబ్బంది పడ్డాను. కానీ సవాలుని తీసుకోకుండా మాత్రం ఉండలేను. 

కొన్ని సార్లు మనం అనుకున్న దానికంటే మనలో ఎక్కువ శక్తి, బలం ఉంటాయి. కొత్త ప్రయాణం మొదలు'' అంటూ ట్వీట్ చేసింది. అయితే ఆమె ఏ సినిమా గురించి ఇదంతా చెబుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

అయితే సమంత చాలా రోజులుగా నందిని రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయనుందని అందులో 70 ఏళ్ల వృద్దురాలిగా  కనిపించనుందని టాక్. ఆ సినిమా కోసమే సమంత ఇలాంటి కామెంట్స్ చేసిందా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు