హీరోకి కూతురు ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్!

By Udayavani DhuliFirst Published Nov 30, 2018, 1:08 PM IST
Highlights

ఈ జెనరేషన్ పిల్లలు తమకు కావాల్సింది తల్లితండ్రులతో కొనిపించుకోవడం కోసం చాలా ట్రిక్ లను ప్లే చేస్తుంటారు. కొందరు ఏడ్చి తమకు కావాల్సింది సాధించుకుంటే మరికొందరు తమ తెలివితో సాధించుకుంటూ ఉంటారు. 

ఈ జెనరేషన్ పిల్లలు తమకు కావాల్సింది తల్లితండ్రులతో కొనిపించుకోవడం కోసం చాలా ట్రిక్ లను ప్లే చేస్తుంటారు. కొందరు ఏడ్చి తమకు కావాల్సింది సాధించుకుంటే మరికొందరు తమ తెలివితో సాధించుకుంటూ ఉంటారు.

మంచు విష్ణు కూతురు వివియానా తన తండ్రిని బ్లాక్ మెయిల్ చేసి తనకు కావాల్సింది కొనిపించుకుందట. ఈ విషయాన్ని మంచు విష్ణు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. పుట్టినరోజు కానుక కోసం తన కూతురు ఎలా బ్లాక్ మెయి చేసిందో చెబుతూ ఓ ట్వీట్ చేశాడు.

''డియర్ నాన్నా.. ఈ ప్రపంచంలో నాకు నువ్వెంతో ముఖ్యమైన, ప్రత్యేకమైన వ్యక్తివి. పుట్టినరోజు నాడు నేనేం కోరుకుంటానో అది కొనిస్తావ్. ఈసారి రోలర్ స్కేట్స్ కొనిస్తావ్ కదూ.. ప్లీస్ కొనిస్తావా..? అవునో కాదో టిక్ చెయ్'' అంటూ ఓ లేఖ రాసింది.

ఆ లెటర్ ని ట్వీట్ చేసిన మంచు విష్ణు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి ఇది క్వాలిఫై అవుతుందని అనుకుంటున్నా అంటూ కామెంట్ చేశాడు. 2009 లో విరానికా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మంచు విష్ణుకి 2011లో అరియానా, వివియానా జన్మించగా, ఈ ఏడాదిన వీరికి మరో మగబిడ్డ జన్మించాడు. 
 

I think this qualifies for emotional blackmail pic.twitter.com/adPF5lt49o

— Vishnu Manchu (@iVishnuManchu)
click me!