అల్లు అర్హ ఎవరి కూతురు.. వందలమంది ఉన్నా తగ్గేదే లే.. తెలుగు అంత బాగా నేర్పించిన బన్నీకి హ్యాట్సాఫ్

Published : Mar 25, 2023, 02:53 PM IST
అల్లు అర్హ ఎవరి కూతురు.. వందలమంది ఉన్నా తగ్గేదే లే.. తెలుగు అంత బాగా నేర్పించిన బన్నీకి హ్యాట్సాఫ్

సారాంశం

సమంత నటిస్తున్న శాకుంతలం చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సమంత కెరీర్ లో ఇది తప్పకుండా ఒక ప్రత్యేక చిత్రం. పౌరాణిక చిత్రంగా దుశ్యంతుడు, శకుంతల ప్రేమ కథని దర్శకుడు గుణశేఖర్ ఆవిష్కరించబోతున్నారు.

సమంత నటిస్తున్న శాకుంతలం చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సమంత కెరీర్ లో ఇది తప్పకుండా ఒక ప్రత్యేక చిత్రం. పౌరాణిక చిత్రంగా దుశ్యంతుడు, శకుంతల ప్రేమ కథని దర్శకుడు గుణశేఖర్ ఆవిష్కరించబోతున్నారు. ఏప్రిల్ 14న శాకుంతలం చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. విడుదలకు తక్కువ సమయమే ఉండడంతో సమంత ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగింది. 

తాజాగా యాంకర్ సుమ సమంతని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో సమంత శాకుంతలం చిత్రం గురించి అనేక విషయాలు పంచుకుంది. ఇక ఈ చిత్రంలో భరతుడు పాత్రలో అల్లు అర్జున్ ముద్దుల కుమార్తె అల్లు అర్హ భరతుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంత అల్లు అర్హ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. 

అల్లు అర్హ సెట్స్ లో తెలుగులో మాట్లాడుతుంటే ఎంత క్యూట్ గా ఉంటుందో మాటల్లో చెప్పలేను. ఆశ్చర్యం ఏంటంటే ఈ చిత్రంలో అర్హకి భారీ డైలాగ్స్ ఉన్నాయి. అది కూడా వందల మంది ముందు చెప్పాలి. కానీ అల్లు అర్హ ఏమాత్రం భయం లేకుండా అద్భుతంగా డైలాగ్స్ చెప్పేసింది. దీనితో వెంటనే సుమ మాట్లాడుతూ.. ఎవరి కూతురు అక్కడ.. తగ్గేదే లే అని పేర్కొంది. దీనితో సమంత అవును తగ్గేదే లే. ఇంగ్లీష్ ఎలాగైనా వస్తుంది. కానీ అర్హకి తెలుగు అంత బాగా నేర్పించిన అల్లు అర్జున్, స్నేహరెడ్డికి హ్యాట్సాఫ్ చెప్పాలి అని పేర్కొంది. 

యశోద సమయంలో అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలిగిపోలేదు. అందుకే ఎక్కువగా ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. చాలా వీక్ గా ఉన్నా. కానీ ఇప్పుడు నా హెల్త్ పర్ఫెక్ట్ గా ఉంది అని సమంత పేర్కొంది. సమంత పూర్తిగా కోలుకోవడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

NNNM Final Collections: ఓటీటీలో బ్లాక్‌ బస్టర్‌ మూవీ.. నారీ నారీ నడుమ మురారి ఫైనల్‌ కలెక్షన్లు
విలన్ తో వర్షంలో రొమాన్స్, ఆ దరిద్రం వల్ల కెరీర్ నాశనం చేసుకున్న ప్రగతి..ఆస్తులు ఎలా కోల్పోయిందో తెలుసా