ఒకరి పాత్రని మరొకరు లాక్కోరు.. అందుకోసం బాధపడను అంటోన్న అంజలి

By Aithagoni RajuFirst Published Jun 5, 2021, 4:01 PM IST
Highlights

నటి అంజలి తనకు వస్తోన్న అవకాశాలపై స్పందించింది. తనకు రాని ఆఫర్స్ విషయంలో తానెప్పుడూ బాధపడనని తెలిపింది. అందరికి ఒకేలాంటి ఆఫర్స్ వస్తాయానుకోవడం కరెక్ట్ కాదని చెప్పింది.

అంజలి.. తెలుగు అందాల హీరోయిన్‌. ఇతర హీరోయిన్ల మాదిరి అందాల ఆరబోతను తాను దూరంగా. హద్దులు దాటని గ్లామర్‌ షోతో ట్రెడిషనల్‌ లుక్‌తో ఆకట్టుకుంటుందీ అమ్మడు. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి మరింతగా దగ్గరైంది. తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోయినా, తమిళంలో మాత్రం మంచి ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇటీవల `వకీల్‌ సాబ్‌` చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది. మరోసారి తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. 

తాజాగా ఈ అమ్మడి తనకు వస్తోన్న అవకాశాలపై స్పందించింది. తనకు రాని ఆఫర్స్ విషయంలో తానెప్పుడూ బాధపడనని తెలిపింది. అందరికి ఒకేలాంటి ఆఫర్స్ వస్తాయానుకోవడం కరెక్ట్ కాదని, కొత్త వారు రావడం వల్ల తనకు ఆఫర్స్ తగ్గుతున్నాయనడంలో  వాస్తవం లేదని తెలిపింది. 

`ఇతర హీరోయిన్ల వల్ల నాకు ఆఫర్స్ తగ్గలేదు. కొత్త వారు వచ్చినా పాత వారికి అవకాశాలు తగ్గుతాయనుకోవడం లేదు. ఒక పాత్రకి ఎవరు సూట్‌ అవుతారో వారినే మేకర్స్ ఎంచుకుంటారు. అంతేగానీ ఒకరి ఆఫర్‌ని మరొకరు లాక్కునే ఛాన్స్ ఉండదు. ఆ పాత్రని నేను చేస్తే బాగుండేదని నేనెప్పుడూ అనుకోను. వేరే వాళ్లు చేసిన పాత్రను నేను చేయాలని ఎప్పుడూ కోరుకోను. నాకు వచ్చిన పాత్రకి పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తా` అని తెలిపింది. రాని పాత్ర కోసం బాధపడను` అని పేర్కొంది అంజలి. 

అంజలి తెలుగులో `బలుపు`, `మసాలా`, `గీతాంజలి`, `శంకరాభరణం`, `డిక్టేటర్‌`, `చిత్రాంగద`, `నిశ్శబ్దం` వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో ఆమె నటించిన `ఆనందభైరవి` విడుదల కానుంది. దీంతోపాటు `ఎఫ్‌3`లోనూ నటిస్తుందని సమాచారం. తమిళంలో ఓ సినిమా, కన్నడలో మరో సినిమా చేస్తుంది అంజలి. 

click me!