గతవారం పారిపోయి పెళ్లి చేసుకున్నా.. సమంత కామెంట్!

Published : Jul 29, 2018, 02:12 PM ISTUpdated : Jul 30, 2018, 12:16 PM IST
గతవారం పారిపోయి పెళ్లి చేసుకున్నా.. సమంత కామెంట్!

సారాంశం

సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేయడం చూస్తుంటాం. తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ ఇలా ఏ సెలబ్రిటీ ఫోటోనైనా తీసుకొని తమ ఫోటో పక్కన జోడించి మురిసిపోతుంటారు అభిమానులు

సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేయడం చూస్తుంటాం. తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ ఇలా ఏ సెలబ్రిటీ ఫోటోనైనా తీసుకొని తమ ఫోటో పక్కన జోడించి మురిసిపోతుంటారు అభిమానులు. తాజాగా హీరోయిన్ సమంత ఫోటోను కూడా ఓ అభిమాని ఇలానే మార్ఫింగ్ చేశాడు. ఆ ఫోటోను కాస్త ట్విట్టర్ షేర్ చేశారు.

అది సమంత పెళ్లి ఫోటో. నాగచైతన్యకు బదులు అభిమాని తన ఫోటోను పెట్టుకున్నాడు. ఈ ఫోటో కాస్త వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంతను తన అభిమాని ఒకరు ఈ ఫోటోను షేర్ చేస్తూ.. 'సమంత ఏంటిది..? అని ప్రశ్నించాడు.

దానికి సమాధానంగా ఆమె 'గతవారం పారిపోయి వివాహం చేసుకున్నాం.. ఇది ఎలా లీక్ అయిందో తెలియదు. మాది తొలి చూపులోనే కలిగిన ప్రేమ' అంటూ ట్వీట్ చేశారు. సమంత ఇచ్చిన రిప్లైకు అభిమానులు నవ్వుకున్నారు. నీ చమత్కారానికి నవ్వు ఆపుకోలేకపోతున్నాం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్