25కోట్లా?.. మీతో తప్పుడు డీల్‌ కుదుర్చుకున్నారు.. `స్టార్‌ హీరో వద్ద అప్పు` వార్తలపై సమంత అదిరిపోయే కౌంటర్‌

Published : Aug 05, 2023, 01:58 PM IST
25కోట్లా?.. మీతో తప్పుడు డీల్‌ కుదుర్చుకున్నారు.. `స్టార్‌ హీరో వద్ద అప్పు` వార్తలపై సమంత అదిరిపోయే కౌంటర్‌

సారాంశం

ఓ స్టార్‌ హీరో వద్ద సమంత రూ.25కోట్లు అప్పు తీసుకుందని ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈనేపథ్యంలో తాజాగా దీనిపై సమంత స్పందించింది. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. 

స్టార్‌ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్‌లో ఉంది. సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి పూర్తిగా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. మయోసైటిస్‌ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకునేందుకు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటుంది. ఈక్రమంలో తన వ్యాధికి చాలా ఖర్చు అవుతుందని, ఏకంగా ఓ స్టార్‌ హీరో వద్ద సమంత రూ.25కోట్లు అప్పు తీసుకుందని ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈనేపథ్యంలో తాజాగా దీనిపై సమంత స్పందించింది. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆమె వెల్లడించింది. 25కోట్లా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎవరో మీతో తప్పుడు డీల్‌ సెట్‌ చేసుకున్నారని ఫన్నీ కామెంట్‌ చేసింది. 

ఇందులో సమంత చెబుతూ, `మయోసైటిలస్‌ వ్యాధి చికిత్సకి రూ.25కోట్లా? ఎవరో మీతో డీల్ కుదుర్చుకున్నారు(తప్పుడు సమాచారం ఇచ్చారు). అందులో నేను చాలా తక్కువ మాత్రమే ఖర్చు చేస్తున్నందుకు సంతోషిస్తున్నా. నేను చేసిన పని కారణంగా నాకు ఎంతో కొంత ఉంది. నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను. మయోసైటిస్‌ వ్యాధి ఇప్పుడు వేలాడి మంది ఎదుర్కొంటున్న సమస్య. చికిత్సకి సంబంధించిన మేం అందించే సమాచారం విషయంలో జాగ్రత్తగా ఉండండి` అని పేర్కొంది సమంత.

తాను అప్పు చేయాల్సిన స్థితిలో లేనని, తనహెల్త్ ని తాను చూసుకోగలనని వెల్లడించింది సమంత. తప్పుడు వార్తలను క్రియేట్‌ చేసేవారికి స్ట్రాంగ్‌ కౌంట్‌ ఇచ్చిందీ బ్యూటీ. తాజాగా ఇన్‌ స్టా స్టోరీస్‌లో ఆమె వెల్లడించిన ఈ పోస్ట్ వైరల్‌ అవుతుంది. గతేడాది సినిమాలకు కొంత గ్యాప్‌ వచ్చింది. ఆమె మయోసైటిల్‌ వ్యాధి చికిత్స కోసం అమెరికా వెళ్లింది. దాదాపు రెండు మూడు నెలల తర్వాత తన సమస్య గురించి చెప్పింది. ఓ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత క్రమంగా కోలుకుంది. `యశోద` ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయింది. కానీ `శాకుంతలం` ప్రమోషన్స్ లో పార్టిసిపేట్‌ చేసింది. 

అదే సమయంలో ఆగిపోయిన `ఖుషి` సినిమాని పూర్తి చేసుకుంది. ఇందులో విజయ్‌ దేవరకొండతో కలిసి నటిస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 1న రిలీజ్‌ కానుంది. దీంతోపాటు హిందీలో `సిటాడెల్‌` వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. వరుణ్‌ ధావణ్‌ మేల్ లీడ్‌ చేస్తున్నారు. ఇది కూడా షూటింగ్‌ పూర్తయ్యింది. ఈ రెండింటి షూటింగ్‌లు పూర్తి కావడంతో బ్రేక్‌ తీసుకుంది సమంత.ఏడాది తర్వాత తాను మళ్లీ వస్తానని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. ప్రకృతిలో అసలు లైఫ్‌ని ఆస్వాదిస్తుంది. 

ఇదిలా ఉంటే సమంతకి ఓ అరుదైన గౌరవం దక్కింది. ఆమె న్యూయార్క్ ల నిర్వహించే 41వ ఇండియన్‌ పరేడ్‌లో పాల్గొనబోతుంది. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అసోసియేషన్‌ నుంచి దీనికి సంబంధించిన ఆహ్వానం అందుకుంది సమంత. ఆగస్ట్ 20న ఇది న్యూయార్క్ లో జరగనుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం
సుమ కు బాలకృష్ణ భారీ షాక్, అఖండ 2 దెబ్బకు 14 సినిమాలు గల్లంతు..?