అఖిల్ కోసం అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ అంటున్న శ్రీకాంత్ అడ్డాల, హిట్ ఇవ్వగలడా..?

Published : Aug 05, 2023, 11:44 AM IST
అఖిల్ కోసం అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ అంటున్న శ్రీకాంత్ అడ్డాల, హిట్ ఇవ్వగలడా..?

సారాంశం

ఎన్ని సినిమాలు చేసినా.. ఎంత మంచి దర్శకుడితో చేసినా. సాలిడ్ హిట్ కొట్టలేకపోతున్నాడు అక్కినేని అఖిల్. వారసత్వంతో సినిమాల్లోకి వచ్చినా.. తన టాలెంట్ తో ఎదగాలని చూస్తున్న అఖిల్  కోసం అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేశానంటున్నాడు శ్రీకాంత్ అడ్డాల. 

పాపం అఖిల్.. కెరీర్ బిగినింగ్ నుంచి ఎన్నో ఇబ్బందులు. ఇప్పటి వరకూ సరైన హిట్ పడింది లేదు. అయితే ప్లాప్.. లేదా యావరేజ్ సినిమా తప్పించి ఇప్పటి వరకూ సాలిడ్ హిట్ కొట్టలేదు. స్టార్ హీరో స్టేటస్ సంగతి తరువాత.. అసలు ఎంత ప్రయత్నించినా.. హీరోగా గట్టిగా నిలబడలేకపోతున్నాడు అఖిల్. అటు నాగార్జున కూడా అఖిల్ విషయంలో ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మొదట్లో కాస్త నిర్లక్ష్యంగా ఉన్న అఖిల్ ఆతరువాత కెరీర్ మీద గట్టిగా కాంన్సంట్రేట్ చేశాడు. 

సినిమా కోసం కష్టపడటం మొదలు పెట్టాడు. అయినా సరే అదృష్టం వరించలేదు అఖిల్ కు. రీసెంట్ గా వచ్చిన ఏజెంట్ సినిమాతో ఏదైనా సాధిస్తాడు అనుకుంటే అది కూడా ప్లాప్ అయ్యి నిరాశను మిగిల్చింది. ఈసినిమా కోసం దాదాపు మూడేళ్ల కష్టపడ్డాడు అఖిల్. అతని కష్టం ఏంటో యాక్టింగ్ లో...ముఖ్యంగా అతను మేకోవర్ అయిన తీరులోనే తెలిసిపోయింది. సిక్స్ ప్యాక్ ఓక లెక్క అయితే.. క్యారెక్టర్ కోసం తన బాడీని రకరకాలుగా మలుచుకున్నాడు అఖిల్. మూడేళ్లు అలానే ఆ బాడీని మెయింటేన్ చేయడం అంటే మాటలు కాదు. సినిమా కోసం అంత కష్టపడ్డా అఖిల్ ను అంతా మెచ్చుకున్నారు.. కాని సినిమా హిట్ అవ్వలేదు. 

ఇది ఇలాగే కొనసాగితే..  అఖిల్ సినిమాలకు గుడ్ బై చెప్పక తప్పదు. అఖిల్ కెరీర్‌‌లో ఎదైనా చెప్పుకోదగ్గ సినిమా ఉందంటే అది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పాలి.  అసులు ముందు నుంచి నాగార్జున కూడా అఖిల్ కు రొమాంటిక్ హీరో ఇమేజ్ రావాలనే చూసినట్టు అనిపించింది. అది వర్కైట్ అయినా.. సినిమాలు మాత్రం పెద్దగా ఆడకపోవడం తో యాక్షన్ ఇమేజ్ వైపు టర్న్ అయ్యాడు అఖిన్. అయితే తాజాగా అఖిల్ కోసం ఓ మంచి కథ రెడీ చేసి తీసుకొచ్చారట డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.

అఖిల్ తో పాటు..నాగార్జునకు కూడా కథ చెప్పాడటన శ్రీకాంత్ .. కథ బాగా నచ్చడంతో ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల పెద కాపు చిత్రంతో బిజీగా ఉన్నాడు. కొత్తవారితో ఈసినిమా చేస్తున్నాడు శ్రీకాంత్. అది పూర్తయినవెంటనే అఖిల్‌‌తో సినిమా స్టార్ట్ చేయాలని చూస్తున్నారట.. అయితే ఈసారి కూడా యాక్షన్ వైపే మొగ్గు చూపిస్తున్నాడు అఖిల్. శ్రీకాంత్ తయారు చేసిన కథ కూడా అదేనట. అది మాస్ యాక్షన్ చిత్రం అని తెలుస్తోంది. దానికోసం అఖిల్ ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టినట్టు ఇండస్ట్రీ టాక్. 

ఇక ఈ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రోడ్యూసర్  దిల్ రాజు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. . కథల విషయంలో దిల్ రాజు‌‌కు మంచి అనుభవం ఉంది. తనకు కథ నచ్చిందంటే సినిమా 50 శాతం హిట్ అయినట్టే.. చూడాలి మరి అఖిల్.. ఈ సినిమాతో అయినా హిట్ ట్రాక్‌‌లోకి వస్తాడా అని. ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ అఖిల్‌‌కు సూపర్ హిట్ ఇవ్వలేకపోయాడు. శ్రీకాంత్ అడ్డాల అయిన అఖిల్‌‌కి బ్లాక్ బస్టర్ ఇస్తాడెమో చూడాలి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది