Samantha Comments Viral: రానా భార్య మిహికా డ్రెస్‌పై సమంత కామెంట్‌.. నెట్టింట వైరల్‌

Published : Mar 31, 2022, 11:10 PM IST
Samantha Comments Viral: రానా భార్య మిహికా డ్రెస్‌పై సమంత కామెంట్‌.. నెట్టింట వైరల్‌

సారాంశం

టాలీవుడ్‌ హీరో రానా  ఫ్యామిలీతో సమంతకి మంచి అనుబంధం ఉంది. ఆయన భార్య మిహికా పోస్ట్ లకు సమంత కామెంట్స్ పెడుతుంటుంది. తాజాగా డ్రెస్‌పై పెట్టిన కామెంట్‌ వైరల్‌ అవుతుంది.

సమంత(Samantha) సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌. అయితే ఇది నిన్నటి మాట. ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయింది. `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` ఇండియా వైడ్‌గా బాగా ఆదరణ పొందడం, దీని ద్వారా సమంత సైతం మంచి ప్రశంసలందుకోవడం అందుకు కారణమని చెప్పొచ్చు. మరోవైపు ఇటీవల `పుష్ప` చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేసి పాన్‌ ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయ్యింది. కేవలం నటిగానే కాదు, ఫ్యాషన్‌ పరంగానూ సమంత ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. 

గత రెండేళ్లుగా ఆమె ఫ్యాషన్‌ ఐకాన్‌గా నిలుస్తుంది. ట్రెండీ ఔట్‌ఫిట్‌లో ఆమె చేసిన ఫోటో షూట్లు జనరల్‌ ఆడియెన్స్ నే కాదు, ఆమె అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇప్పటికీ ట్రెండీ ఔట్‌ఫిట్‌లో హోయలు పోతూ మంత్రముగ్దుల్ని చేస్తుంది సమంత. ఇదిలా ఉంటే ఆమెకి మరొక సెలబ్రిటీ ఔట్‌ఫిట్‌పై ప్రశంసలు కురిపించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆమె చేసిన కామెంట్‌ సైతం ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 

టాలీవుడ్‌ హీరో రానా(Rana)  ఫ్యామిలీతో సమంతకి మంచి అనుబంధం ఉంది. చైతూ(Naga Chaitanya)కి వైఫ్‌గా ఉన్నప్పుడు ఈ రెండు కుటుంబాల మధ్య రిలేషన్‌ ఉన్న విషయం తెలిసిందే. రానా మ్యారేజ్‌ టైమ్‌లో సమంత కీలకంగా వ్యవహరించింది. మిహికా బజాజ్‌(Miheeka Bajaj)తో రానా మ్యారేజ్‌ విషయంలో సమంత పాత్ర చాలా ఉందనే టాక్‌ వినిపించింది. మరోవైపు మిహికాతో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తుంది సమంత. తాజాగా రానా, మిహికాలు ఓ వెడ్డింగ్‌ పార్టీలో పాల్గొన్నారు. ఇందులో బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసింది మిహికా. ఇది చూసిన సమంత ఫిదా అయ్యింది. 

దీంతో ఉండబట్టలేక కామెంట్‌ చేసింది. `నీ ఔట్‌ఫిట్‌ నాకు బాగా నచ్చింది` అని పోస్ట్ పెట్టింది సమంత. దీనికి మిహికా స్పందించింది. ధన్యవాదాలు తెలిపింది. మరో ఫోటోకి కూడా సో ప్రెట్టీ అంటూ కామెంట్‌ పెట్టింది సమంత. ఆల్మోస్ట్ మిహికా ప్రతి మూవ్‌మెంట్‌కి స్పందిస్తుంది. పోస్ట్ ల రూపంలో ఆమెని ఎంకరేజ్‌ చేస్తుంది. ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని చాటుకుంటుంది. ఇక లేటెస్ట్ గా సమంత పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుండటం విశేషం. సమంత.. నాగచైతన్యతో విడిపోయినప్పటికీ వారి ఫ్యామిలీ రిలేటివ్స్ తో మాత్రం సమంత టచ్‌లోనే ఉంటున్నట్టు తెలుస్తుంది. వెంకటేష్‌ కూతురు ఆశ్రితతోనూ తన రిలేషన్‌ కొనసాగిస్తుంది. వీరిద్దరు చాట్‌ చేసుకుంటుంటారు. ఒకరి పోస్ట్ లకు ఒకరు కామెంట్స్ చేసుకుంటారు. 

ఇక సమంత ప్రస్తుతం నటిగా ఫుల్‌ బిజీగా ఉంది. ఆమె నటించిన `శాకుంతలం` చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతుంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. బన్నీ కూతురు అల్లు అర్హ ఇందులో బాల నటిగా నటిస్తుంది. తమిళంలో `కాతు వాకుల రెండు కాదల్‌` సినిమాలో నటించింది. మరోవైపు సమంత `యశోద` సినిమాలో నటిస్తుంది. అలాగే తమిళం, తెలుగులో ఓ బైలింగ్వల్‌ సినిమా చేస్తుంది. ఓ ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్ చేస్తుంది. దీంతోపాటు విజయ్‌ దేవరకొండతో నటించబోతుందని టాక్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ