
మజిలీ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న అక్కినేని కపుల్స్ మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మజిలీ సినిమా ద్వారా మూడు బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న సమంత - నాగ చైతన్య ఇక నుంచి మూడేళ్ళకొకసారైనా డిఫరెంట్ కథతో వెండితెరపై కనిపించాలని అనుకుంటున్నారు.
ఇప్పటివరకు ఈ కాంబోలో వచ్చిన నాలుగు సినిమాల్లో ఆటోనగర్ సూర్య ఒక్కటే బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఏ మాయ చేసావే - మనం ట్రెండ్ సెట్టవ్వగా మజిలీ మరో తియ్యని జ్ఞాపకం అయ్యిందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం సమంత కొత్త కథల కోసం ఎదురుచూస్తోంది. కుదిరితే ఈ ఏడాది చివరలో తన భర్తతో నటించి మరో సినిమాను విడుదల చెయ్యాలని ప్లాన్ వేసుకుంటోంది.
దర్శకులు మంచి కాన్సెప్ట్ తో వస్తే వెంటనే ఒకే చేస్తాం అని సమంత తన సన్నిహితులకు చెబుతున్నారట. మరి ఆ లక్కీ ఛాన్స్ ఏ దర్శకుడు అందుకుంటాడో చూడాలి. గత వారం రిలీజైన మజిలీ ఫస్ట్ వీకెండ్ లోనే 17కోట్లకు పైగా షేర్స్ ను అందించి బయ్యర్స్ కి మంచి లాభాలను అందిస్తోంది.