'మహర్షి' డైరెక్టర్ నెక్స్ట్ ఎవరితోనంటే..?

Published : Apr 12, 2019, 03:10 PM IST
'మహర్షి' డైరెక్టర్ నెక్స్ట్ ఎవరితోనంటే..?

సారాంశం

మెగాహీరో రామ్ చరణ్ ప్రస్తుతం 'RRR' సినిమా కోసం పని చేస్తున్నారు. హైవోల్టేజ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. 

మెగాహీరో రామ్ చరణ్ ప్రస్తుతం 'RRR' సినిమా కోసం పని చేస్తున్నారు. హైవోల్టేజ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదిలోనే పూర్తవుతుందని సమాచారం.

ప్రస్తుతం చరణ్ తో సినిమా చేయాలని చాలా మంది దర్శకుడు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా చేరాడు. ఇటీవల చరణ్ ని కలిసిన వంశీ పైడిపల్లి ఓ లైన్ వినిపించాడట. ప్రాజెక్ట్ కి సంబంధించి ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

వంశీ చెప్పిన పాయింట్ చరణ్ కి నచ్చడంతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వంశీ.. 'మహర్షి' సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. సినిమా రిలీజ్ తరువాత కొంతకాలం బ్రేక్ తీసుకొని చరణ్ ప్రాజెక్ట్ మీద పని చేయాలని వంశీ ప్లాన్ చేస్తున్నాడు.

'RRR'సినిమా తరువాత చరణ్.. వంశీ దర్శకత్వంలో పని చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించే అవకాశాలు ఉన్నాయి. వంశీ పైడిపల్లితో పాటు చరణ్ తో సినిమా చేయడానికి కొరటాల శివ, సురేందర్ రెడ్డి, క్రిష్ వంటి దర్శకులు కూడా ఎదురుచూస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?