సమంత ఇంట్లో చోరీ.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ స్టార్ హీరో

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 12, 2022, 03:06 PM IST
సమంత ఇంట్లో చోరీ.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ స్టార్ హీరో

సారాంశం

ప్రస్తుతం సమంత ఏం చేసినా వైరల్ న్యూస్ అవుతోంది. నాగ చైతన్యతో విడిపోయాక సమంత ఎక్కువగా వార్తల్లో నిలిచింది. దీనితో సమంత గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం సమంత ఏం చేసినా వైరల్ న్యూస్ అవుతోంది. నాగ చైతన్యతో విడిపోయాక సమంత ఎక్కువగా వార్తల్లో నిలిచింది. దీనితో సమంత గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఆమె గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. 

ఇక సమంత ఇంట్లో దొంగతనం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజంగా కాదు. సమంత నటించిన ఓ యాడ్ గురించి ఈ వార్త. సమంత, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కుర్ కురే యాడ్ లో నటించారు. అక్షయ్ కుమార్ కుర్ కురే కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాడ్ లో అక్షయ్ కుమార్ సమంత ఇంటికి దొంగగా వస్తాడు. 

ఇంట్లో ఉన్న విలువైన వస్తువలపై కాకుండా కుర్ కురేపై అతడి కన్ను పడుతుంది. అక్షయ్ కుమార్ కుర్ కురే ప్యాకెట్ తీసుకోగానే సమంత ఫ్యామిలీ వచ్చేస్తుంది. అక్షయ్ దొంగిలించిన కుర్ కురే ప్యాకెట్ సామ్ లాక్కుని తన ఫ్యామిలీతో కల్సి తింటూ ఉంటుంది. అది చూసి అక్షయ్ కుమార్ గుటకలు వేస్తూ ఉంటాడు. దీనితో సమంత కుర్ కురే ప్యాకెట్ అతడికి ఇస్తుంది. 

ప్యాకెట్ మొత్తం ఖాళీ చేశాక అక్షయ్ బయలుదేరేందుకు సిద్ధం అవుతాడు. సమంత అతడిని ఆపి వాహనంలో వెళ్ళు అని చెబుతుంది.. నా కోసం వాహనమా అని సంబరపడే లోపే పోలీస్ జీప్ సైరన్ వినిపిస్తుంది. అలా సమంత అక్షయ్ కుమార్ ని పోలీస్ లకు పట్టిస్తుంది. ఫన్నీగా ఉన్న ఈ యాడ్ ఆకట్టుకుంటోంది. సినిమాల్లో పోలీస్ అధికారిగా నటించిన మీరు కుర్ కురే దొంగ కావడం ఏంటి.. ఈ ప్రవర్తన ఏంటి అక్షయ్ కుమార్ అంటూ సమంత సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్ చేసింది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Naga Vamsi: సంక్రాంతి సినిమాల పోటీపై నిర్మాత నాగవంశీ హాట్‌ కామెంట్‌.. `అనగనగా ఒక రాజు` ఎందుకు స్పెషల్‌ అంటే
The Raja Saab రిజల్ట్ ని ప్రభాస్‌ని ముందే ఊహించాడా? మారుతితో ఏం చెప్పాడంటే.. ది రాజా సాబ్‌ 2 అప్‌డేట్‌