సమంత, చైతూల బాచిలర్స్ పార్టీ కూడా అయిపోయింది

Published : Sep 24, 2017, 07:35 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
సమంత, చైతూల బాచిలర్స్ పార్టీ కూడా అయిపోయింది

సారాంశం

అక్టోబర్ 6న సమంత, చైతూల పెళ్లి గోవాలో గ్రాండ్ గా ఇరు సంప్రదాయాల ప్రకారం వేడుక సమంత, చైతూల బాచిలర్స్ పార్టీకి అటెండైన రామ్ చరణ్ తదితరులు

తెలుగు సినీ అభిమానులకు త్వరలో ఒక్కటవబోతున్న టాలీవుడ్ ప్రేమ జంట పెళ్లి కి సంబంధించిన ఏ అప్ డేట్ వచ్చినా ఆసక్తే. ఇక అక్టోబర్ 6న జరగనున్న సమంత, చైతూల వివాహ వేడుక గోవాలో ఏర్పాటైంది. ఇప్పటికే ఆహ్వానితులకు ఇన్విటేషన్ లు కూడా వెళ్లాయి.. మరోవైపు పెళ్లికి ముందు జరుపుకునే బాచిలర్స్ పార్టీ కూడా అపోయింది.ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైన అక్కినేని ఫ్యామిలీ అంతా వెడ్డింగ్ మూడ్ లోకి వచ్చేసింది. గ్రాండ్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోవాలో మరో రెండు వారాల్లో సమంత అక్కినేని వారి ఇంట్లో కోడలిగా అడుగుపెట్టబోతోంది.

 

అక్టోబర్ 6వ తేదీ ఆ శుభకార్యానికి శుభ ముహూర్తంగా ఫిక్స్ అయింది. ఈ నేపథ్యంలోనే బ్యాచిలర్ లైఫ్‌లో తన చివరి రోజులని సెలబ్రేట్ చేసుకుంటోంది సమంత. ఆ సెలబ్రేషన్స్‌లో భాగంగానే సినీ పరిశ్రమలోనేకాకుండా తన పర్సనల్ క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమందికి తాజాగా బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది సమంత.

 

నాగచైతన్య, నాగార్జున, అఖిల్, సుశాంత్, అమల వంటి అక్కినేని ఫ్యామిలీకి చెందిన స్టార్స్‌ తోపాటు రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా ఈ బ్యాచిలర్ పార్టీకి హాజరై ఎంతో సంతోషంగా కెమెరాలకి ఫోజిచ్చారు. ఇక సమంత కెరీర్ విషయానికొస్తే, రామ్‌చరణ్‌తో నటిస్తున్న రంగస్థలం సహా దాదాపు అర డజన్ చిత్రాలు ఆమె చేతిలో వున్నాయి. అందుకే పెళ్లయిన వెంటనే మళ్లీ సినిమా షూటింగ్స్‌తో బిజీ కానున్నట్టు సమంత గతంలోనే చెప్పేసింది.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ అరెస్ట్ విషయంలో జ్యోపై అనుమానం- కార్తీక్ నిజం కనిపెడతాడా?
వెంకటేష్ కొడుకు అర్జున్ ను హీరోగా పరిచయం చేయబోతున్న డైరెక్టర్ ఎవరో తెలుసా? నిజమెంత?