ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా 'ఓం నమో వేంకటేశాయ'

Published : Jan 31, 2017, 02:40 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా 'ఓం నమో వేంకటేశాయ'

సారాంశం

 నాగార్జున హీరోగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఓం నమో వెంకటేశాయ ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా 'ఓం నమో వేంకటేశాయ' విడుదల     

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మిస్తున్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. ఈ చిత్రం షూటింగ్‌తోపాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా పూర్తి చేసుకొని ఫిబ్రవరి 10న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి సిద్ధమైంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

 

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి చిత్రాలు ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. యం.యం.కీరవాణి సంగీతంలో రూపొందిన ఈ చిత్రాల్లోని పాటలు సంచలన విజయం సాధించాయి. యం.యం.కీరవాణి సంగీత సారధ్యంలో రూపొందిన 'ఓం నమో వేంకటేశాయ' ఆడియోకి కూడా విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రంలోని భక్తిరస గీతాలు శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో మరో భక్తిరస చిత్రంగా రూపొందిన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. 

 

అక్కినేని నాగార్జున హాథీరామ్‌ బాబాగా మరో అద్భుతమైన పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్‌ నటిస్తుండగా, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కనిపించనుంది. జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్‌, విమలా రామన్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 

 

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందిస్తున్న ఈ చిత్రానికి స్వరవాణి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్‌.గోపాల్‌రెడ్డి, జె.కె.భారవి, కిరణ్‌కుమార్‌ మన్నె, గౌతంరాజు ఇతర సాంకేతిక వర్గం. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar: 1000 కోట్ల క్లబ్ లో ధురంధర్..ఈ ఫీట్ సాధించిన 9 సినిమాలు ఇవే, 4 టాలీవుడ్ నుంచే
Jabardasth : ఈగో వల్ల జబర్దస్త్‌ ను వదిలి వెళ్లిపోయిన స్టార్ కమెడియన్ ఎవరో తెలుసా?