
ఇప్పుడు ఎక్కడ చూసినా సామజవరగమన చిత్రం కబుర్లే. శ్రీవిష్ణు కు ఈ మధ్య సరైన హిట్ లేదు. ‘రాజ రాజ చోర’ తర్వాత ‘అర్జున ఫల్గుణ’ ‘భళా తందనాన’ ‘అల్లూరి’ వంటి ప్లాప్ లు పడ్డాక అతను హీరోగా వచ్చిన చిత్రం ‘సామజవరగమన’. కామెడీ చిత్రం కావటంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు. ‘వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకుడు కావటం కూడా ప్లస్ అయ్యింది సామజవరగమన జూన్ 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై మంది స్పందన రాబట్టుకుంటోంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతూ.. శ్రీవిష్ణు టీంలో జోష్ నింపుతోంది.
హాస్య మూవీస్ బ్యానర్ పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పకులుగా వ్యవహరించారు. జూన్ 29 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఆ వివరాలు చూస్తే...
నైజాం 1.20 cr
సీడెడ్ 0.40 cr
ఉత్తరాంధ్ర 0.50 cr
ఈస్ట్ 0.28 cr
వెస్ట్ 0.22 cr
గుంటూరు 0.35 cr
కృష్ణా 0.45 cr
నెల్లూరు 0.25 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.65 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.25 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.90 cr (షేర్)
‘సామజవరగమన’ (Samajavaragamana) చిత్రానికి రూ.3.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.2 కోట్ల షేర్ ను రాబట్టాలి.
ఈ చిత్రంలో బిగిల్ (విజిల్) ఫేం రెబా మోనికా జాన్ (Reba Monica John) ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది. సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిశోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్, ప్రియ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండా నిర్మించారు. సినిమా విజయానందంలో ఉన్న శ్రీవిష్ణు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకలోకానికి ట్వీట్ రూపంలో సందేశాన్ని పోస్ట్ చేశాడు.
మా సామజవరగమన సినిమాపై మీరంతా చూపిస్తున్న అసమానమైన ప్రేమకు ధన్యవాదాలు. సినిమాకు అద్బుతమైన స్పందన వస్తున్నందుకు కృతజ్ఞతలు. సినిమాను ఫన్‌టాస్టిక్ బ్లాక్‌బస్టర్ చేసినందుకు ధన్యవాదాలు.. అని సంతోషాన్ని ట్వీట్ ద్వారా తెలియజేశాడు శ్రీవిష్ణు