
అప్పట్లో యాత్ర సినిమా విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో రెండో భాగం కూడా తెరకెక్కిస్తారని సరిగ్గా 2024 ఎన్నికల ముందు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది .ఇప్పుడది నిజం కాబోతోంది. దాంతో అసలు ఆ సినిమా ఎలా ఉండబోతోంది. సినిమాలో ఏయే అంశాలు చోటు చేసుకోబోతున్నాయనే విషయమై దర్శకుడు మహీ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్న ఈ చిత్రం గురించి చిన్న అప్డేట్ వచ్చింది.
తాజాగా జూలై 8, 2023 అని మాత్రమే రాస్తూ ఓ ట్వీట్ చేశారు డైరెక్టర్ మహి వి.రాఘవ్. దీంతో ఈ ట్వీట్ వెనుక అసలు విషయం ఏంటి అనే కోణంలో జనం డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే జూలై 8వ తేదీ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కాబట్టి ఆయన పుట్టిన రోజు సందర్భంగా యాత్ర 2కి సంబంధించి కీలక అప్‌డేట్ ఉండబోతుందనే విషయాన్ని మహి వి.రాఘవ్ ఇలా కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది. అలాగే మ్యూజిక్ డైరక్టర్ సంతోష్ నారాయణ్ ఈ ప్రాజెక్టు కు పనిచేయబోతున్నట్లు క్లారిటి వచ్చింది. ఒక్క చిన్న డేట్‌తో జనాల్లో క్యూరియాసిటీ పెంచడం అనేది గొప్ప విషయమే.
మహీ వి రాఘవ్ మాట్లాడుతూ... “సినిమా చూసి జనాలు ఓట్లు వేస్తారు అనుకుంటే ఇతర పార్టీ నాయకులు చంద్రబాబు , పవన్ కళ్యాణ్ కూడా బయోపిక్ లు తీసుకోవచ్చు. అయినా వైయస్ కి ఓటు వేసిన వారంతా నా సినిమా చూసి ఉంటే బాహుబలిలా పెద్ద హిట్ అయ్యేది. సినిమాల వల్ల ఓట్లు పడతాయి అనేది కేవలం అపోహ మాత్రమే” అంటూ చెప్పుకొచ్చాడు.
అలాగే యాత్ర 2 కథ ఎలా ఉండబోతుందో చెప్తూ... వైఎస్ జగన్ పాదయాత్ర దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అయ్యి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో సినిమా ఎండ్ అవుతుందంటూ చెప్పుకొచ్చాడు. కథ ఇంకా స్క్రిప్ట్ వర్క్ లోనే ఉందని, నటించే నటులు విషయంలో కూడా సరైన వారి కోసం వెతుకుతున్నామని వెల్లడించాడు. కాగా ఈ బయోపిక్ లో జగన్ రోల్ ని తమిళ నటుడు జీవా నటించబోతుండటంటూ కొన్ని రోజులు నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ‘సైతాన్’ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా?’ సినిమా కూడా రూపొందుతోంది. యాత్ర 2 చిత్రం ఇక ఈ చిత్ర కథాంశం...వైఎస్ఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి ‘యాత్ర 2’ మొదలవుతుంది. ఆ సమయంలో జగన్ ఎలా ఉండేవారు..? తండ్రి మరణం తరువాత ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు..? ఓ రాజకీయనాయకుడిగా ప్రజలకు ఎలా మెప్పించగలిగాడనే విషయాలతో ‘యాత్ర 2’ని తెరకెక్కించబోతున్నారని వినికిడి.
ఈ నేపధ్యంలో జగన్ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. అప్పట్లో ‘రంగం’ ఫేమ్ నటుడు అజ్మల్ తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ దర్శకుడు మహి వి రాఘవ్ మాత్రం బాలీవుడ్ నటుడిని రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ‘స్కామ్ 1992’లో నటించిన ప్రతీక్ గాంధీని జగన్ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారట. ప్రతీక్ లో జగన్ పోలికలు ఉన్నాయని.. అతడి రాకతో ప్రాజెక్ట్ కు పాన్ ఇండియా అప్పీల్ వచ్చే ఛాన్స్ ఉందని ఆయన్నే ఫైనల్ చేయబోతున్నారని అంటున్నారు. అయితే అదే సమయంలో తమిళ నటుడు సూర్య ని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దుల్కర్ ని సైతం ఈ ప్రాజెక్టులోకి తెచ్చే అవకాసం ఉందని చెప్పుకున్నారు. కానీ ఫైనల్ గా ఎవరనేది మాత్రం తెలియాల్సి ఉంది.