టైగర్ జిందా హై సెకెండ్ సాంగ్..భలే రొమాంటిక్ గా వుంది

Published : Dec 04, 2017, 01:11 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
టైగర్ జిందా హై సెకెండ్ సాంగ్..భలే రొమాంటిక్ గా వుంది

సారాంశం

సల్మాన్, కత్రినా జంటగా వస్తోన్న టైగర్ జిందా హై ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఏక్ థా టైగర్ సీక్వెల్ గా వస్తున్న మూవీ ఈ మూవీలోని రెండో పాట దిల్ దియా గలాలో రొమాంటిక్ సల్మాన్, కత్రినా

బాలీవుడ్ లో సల్మాన్‌, కత్రినా జంటకున్న క్రేజ్‌ ఏంటో తెలిసిందే. వీరిద్దరు జోడీగా నటించిన తాజా చిత్రం ‘టైగర్‌ జిందా హై’. అలీ అబ్బాస్‌ జఫర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలోని ‘స్వాగ్‌ సే కరేంగే..’ అనే పాటను ఫస్ట్ విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా రెండో పాటను విడుదల చేసింది.

 

‘దిల్‌ దియానా గల్లన్‌..’ అని సాగే ఈ పాటలో సల్మాన్‌, కత్రినాల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. మంచు కొండలపై ఇంట్లో సల్మాన్‌, కత్రినా కనిపించారు. తెల్లటి మంచులో రంగులతో కత్రినా పెయింటింగ్‌ను సల్మాన్‌ వేశారు. ఈ చిత్రంతో వీరి జంట మరోసారి వెండితెరపై మాయ చేయడానికి సిద్ధమైపోయిందని చర్చ జరుగుతోంది.

 

సల్మాన్‌, కత్రినా ఐదేళ్ల తర్వాత కలిసి నటించిన టైగర్ జిందాహై చిత్రంలో టైగర్‌ పాత్రలో సల్మాన్, కత్రినా జోయా పాత్రలో కనిపించనున్నారు. డిసెంబరు 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2012 సల్మాన్, కత్రినా జోడీగా రిలీజై బ్లాక్‌బస్టర్‌ గా నిలిచిన ‘ఏక్‌ థా టైగర్‌’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందించిన చిత్రమిది.

PREV
click me!

Recommended Stories

2027 Summer: వచ్చే ఏడాది సమ్మర్‌లో బాక్సాఫీసు రణరంగమే.. ఇండియన్‌ సినిమాని రూల్‌ చేయనున్న నాలుగు సినిమాలు
Pawan Kalyan : డిప్యూటీ సీఎం లగ్జరీ కార్ కలెక్షన్ .. ఎన్ని కార్లున్నాయి..? వీటి విలువ ఎంత?