ఫ్యాన్స్ కి షాకిచ్చిన సల్మాన్

Published : Aug 26, 2019, 03:40 PM IST
ఫ్యాన్స్ కి షాకిచ్చిన సల్మాన్

సారాంశం

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ధీరుడు సల్మాన్ ఖాన్ ఇటీవల భారత్ సినిమాతో మొత్తానికి సక్సెస్ అందుకున్నాడు. అనుకున్నట్టుగానే ఈద్ సందర్బంగా సెంటిమెంట్ తో సక్సెస్ కొట్టాడు. అయితే నెక్స్ట్ రంజాన్ కి ఈ స్టార్ హీరో సినిమా ఉండదనే రూమర్స్ ఇటీవల ఆడియెన్స్ లో ఆందోళన కలిగించాయి.   

ఆ రూమర్స్ కి ఎట్టకేలకు ఈ కండల వీరుడు క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం సల్మాన్ ప్రభుదేవా దర్శకత్వంలో దబాంగ్ 3 సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా అనంతరం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఇన్షాల్లా అనే సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఈద్ కి విడుదల కానుందని ముందే చెప్పారు. 

అయితే ఇప్పుడు ఈద్ కి రావడం లేదని సల్మాన్ క్లారిటీ ఇచ్చాడు. అయితే అభిమానులు నిరుత్సాహపడకుండా మరొక సినిమాతో అయినా తప్పకుండా వస్తానని చెప్పకనే చెప్పాడు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో సల్మాన్ సినిమా అనగానే అభిమానుల్లో ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. నెక్స్ట్ ఇయర్ ఈద్ కి వస్తుందనుకున్న ఆ సినిమా వాయిదా పడటంతో కొంత షాక్ తగిలిందనే  చెప్పాలి.

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌