'7 డాగ్స్' టీజర్ రిలీజ్.. సల్మాన్, సంజయ్ దత్ ఇంటర్నేషనల్‌ మూవీ టీజర్‌లో హైలైట్స్ ఇవే

Published : Jun 06, 2025, 04:53 PM IST
Salman Khan, Sanjay Dutt

సారాంశం

సల్మాన్‌ ఖాన్‌, సంజయ్‌ దత్‌ కలిసి నటించిన తొలి ఇంటర్నేషనల్‌ మూవీ  '7 డాగ్స్' టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో సూపర్‌స్టార్‌లు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లుక్స్ అదిరిపోయాయి. మరి టీజర్‌ ఎలా ఉందంటే

'7 డాగ్స్' టీజర్ రిలీజ్:  సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ నటించిన తొలి అంతర్జాతీయ చిత్రం '7 డాగ్స్' టీజర్ విడుదలైంది. ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ టీజర్ అదిరిపోయింది. అందులో అదిరిపోయే యాక్షన్, థ్రిల్లర్ సన్నివేశాలు చూడొచ్చు. 

ఈ సినిమాకి అదిల్ ఎల్ అరబీ, బిలాల్ ఫలాహ్ దర్శకత్వం వహించారు. వీళ్ళు 'బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్', 'మిస్ మార్వెల్' సినిమాలకి కూడా పనిచేశారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  

'7 డాగ్స్' టీజర్‌లో ఏముంది?

'7 డాగ్స్' సినిమాలో అరబ్ సూపర్‌స్టార్స్ కరీం అబ్దెల్ అజీజ్, అహ్మద్ ఎజ్ నటిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి నటించిన 'కిరా & ఎల్ గిన్' అనే సినిమా ఈజిప్ట్‌లో బాగా ఆడింది. ఇక `7 డాగ్స్` టీజర్ చూస్తే .. ఇది ఇంటర్నేషనల్ క్రైమ్ స్టోరీ అని అర్థమవుతుంది. ఈ సినిమా ఇంటర్‌పోల్ ఆఫీసర్ ఖాలిద్ అల్ అజ్జాజీ గురించి చెబుతుంది. 

ఆయన '7 డాగ్స్' సిండికేట్‌లోని సీనియర్ మెంబర్ గలీ అబూ దావూద్‌ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. టీజర్‌లో సంజయ్ దత్ కోపంగా ఎవరిపైనో గన్ పెట్టినట్టు చూపించారు. సల్మాన్ ఖాన్ తన కళ్ళతో, ముఖ కవళికలతో ఏదో చెప్పినట్టు చూపించారు. టీజర్‌ ఆద్యంతం యాక్షన్‌తో, కామెడీగా సాగింది. ఆకట్టుకునేలా ఉంది. సినిమాపై అంచనాలను పెంచింది. 

సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ప్రాజెక్ట్స్

ఈ ఏడాది సల్మాన్ ఖాన్ `సికందర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆయన కొత్త సినిమాకి సంబంధించిన అప్‌ డేట్లు రావాల్సి ఉంది. సంజయ్ దత్ 'ది భూత్ పార్ట్ వన్: ద హాంటెడ్ షిప్' సినిమాలో నటించారు. ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. ఆయన 'హౌస్‌ఫుల్ 5'లో కూడా నటించారు. ఆ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు