
సినిమాతారలు అభిమానులు కోసం చేసే పనులు భలే ముచ్చటగా ఉంటాయి. ఇలాంటి పనులు వారిపై అభిమానాన్ని గౌరవాన్ని మంరింతగా పెంచుతాయి. తాజాగాసల్మాన్ ఖాన్ చేసిన పని కూడా అలాగే ఆయనపై ప్రశంసలు కురిపించేలా చేస్తోంది. వెండితెరపైనే కాదు నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్నాడు సల్మాన్ ఖాన్.. ఓచిన్నారికి ఎప్పుడో ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకుని మరీ నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం ఈన్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే..?
9ఏళ్ళ చిన్నారికి తన నాలుగేళ్ల వయస్సులో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడుసల్మాన్ ఖాన్. అవును నాలుగేళ్ళ చిన్నారి కోసం అప్పుడు కదలి వెళ్లాడు.. విషయం ఏంటంటే.. మహారాష్ట్రలోని ముంబైలో తల్లీ తండ్రులతో సంతోషంగా ఉంటోన్న జగన్బీర్ అనే 4 ఏళ్ల బాలుడు.. సల్మాన్ ఖాన్ పాటలు వింటూ.. ఆయన్ను అనుకరిస్తూ ఉండేవాడు.. అయితే ఆ పిల్లాడు 2018 నుంచి బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ లో జగన్బీర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. చిన్నవయస్సులోనే సల్మాన్ ఖాన్ కు అభిమాని అయినఆ చిన్నారి..తనకు ఓసారి సల్మాన్ ఖాన్ చూడాలని ఉందంటూ చెప్పుకొచ్చారు.
అయితే ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా.. ఇలా తన అభిమాన నటుడు సల్మాన్ ను చూడాలని ఉంది అనడంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా… ఇది చూసిన సల్మాన్ వెంటనే ఆ బాలుడి కోసం కదలి వచ్చాడు. అతనికి ధైర్యం చెప్పాడు. బ్రెయిన్ క్యాన్సర్ వల్ల చూపు కోల్పోతూ.. వస్తున్న ఆ చిన్నారి సల్మాన్ ఖాన్ నుచూడటం కోసం ట్రీట్మెంట్ తీసుకుంటాను అన్నాడు. దాంతో బాయ్ జాన్ మనసు కరిగిపోయింది. నువ్వు ట్రీట్మెంట్ తీసుకుని ఆరోగ్యంగా బయటకు రా.. నేను నిన్ను కలుసుకుంటాను అని అప్పుడు మాట ఇచ్చాడు సల్మాన్. ఇక ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు.
ఇప్పుడు ఆ చిన్నారి జగన్ వయస్సు 9 ఏళ్లు.... క్యాన్సర్ మహామ్మారిని జయించాడు.. దాదాపు ఆరేళ్లపాటు 9 కీమో థెరపీలు చేయించుకున్నాడు జగన్. దీంతో అతడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు సల్మాన్ ఖాన్. ముంబైలోని బాంద్రా రెసిడెన్సీకి జగన్ కుటుంబాన్ని పిలిచి.. వారితో మాట్లాడారు. ఆ చిన్నారికి 96 శాతం కంటిచూపు తిరిగి వచ్చిందని.. రోజు అందరిలాగే స్కూల్ కు వెళ్తున్నాడని ఆ బాలుడి తల్లి సుక్బీర్ కౌర్ చెప్పారు. సల్మాన్ ఖాన్ చేసిన సాయం.. ఇచ్చిన ధైర్యం ఎప్పటికీ మర్చిపోలేనిదంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఆ చిన్నారికి బోలెడు భహుమతులు కూడా ఇచ్చి పంపించాడు సల్మాన్ ఖాన్.