తమిళ నటుడు బాబీ సింహా సౌత్ లో విలక్షణ నటుడిగా దూసుకుపోతున్నాడు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళీ భాషల్లో కూడా బాబీ సింహా నటిస్తున్నాడు. చివరగా బాబీ సింహా తెలుగులో సలార్ చిత్రంలో నటించాడు.
తమిళ నటుడు బాబీ సింహా సౌత్ లో విలక్షణ నటుడిగా దూసుకుపోతున్నాడు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళీ భాషల్లో కూడా బాబీ సింహా నటిస్తున్నాడు. చివరగా బాబీ సింహా తెలుగులో సలార్ చిత్రంలో నటించాడు. అంతకు ముందు చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంలో కూడా బాబీ సింహా విలన్ గా నటించాడు. అయితే తాజాగా బాబీ సింహా తీవ్ర చిక్కుల్లో చిక్కుకున్నాడు.
ఓ వివాదంలో బాబీ సింహాకి ఆలందూర్ కోర్టు నోటీసులు పంపింది. షాకింగ్ విషయం ఏంటంటే బాబీ సింహాపై కేసు పెట్టింది అతడి చిన్ననాటి స్నేహితుడే. ఆలందూర్ కి చెందిన జెఎంఏ హుస్సేన్.. బాబీ సింహాపై కోటిరూపాయల పరువునష్టం దావా వేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హుస్సేన్ పిటిషన్ లో ఉన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తాను, బాబీ సింహా చిన్న నాటి స్నేహితులం అని హుస్సేన్ తెలిపారు. చిన్నప్పుడు కలసి చదువుకున్నాం అని హుస్సేన్ పేర్కొన్నారు.
తన ద్వారా బాబీ సింహాకి జమీర్ కాసిం అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కాసిం భావన నిర్మాణంలో పనిచేస్తున్నాడు. బాబీ సింహా కొడైకెనాల్ లో తాను నిర్మించే భవంతి పనులని కాసిం కి అప్పగించాడు. అయితే 90 శాతం భవనం పూర్తయినప్పటికీ ఇంతవరకు బిల్లులు చెల్లించలేదట. దీనితో కాసిం, బాబీ సింహా మధ్య తీవ్ర గొడవ జరిగింది. తన తండ్రి మధ్యలో ఉండి కాసిం, బాబీ సింహా మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు.
కానీ 77 ఏళ్ల వయసున్న తన తండ్రిపై బాబీ సింహా బెదిరింపులకు పాలపడ్డారు. మీడియా సమావేశంలో గత ఏడాది నన్ను కూడా ఎంతో దూషించాడు. తన కుటుంబాన్ని, తనని బెదిరిస్తున్న బాబీ సింహపై చర్యలు తీసుకోవాలని కోర్టులో హుస్సేన్ పిటిషన్ వేసారు. దీనిపై వివరణ ఇవ్వాలని కోర్టు బాబీ సింహా కి నోటీసులు జారీ చేసింది.