సల్మాన్ ఫై నెటిజన్ల ట్రోలింగ్...అభిమాని అమ్మ ఫోటో ఇచ్చినా.. అంత చిరాకు ఎందుకు అంటూ మండిపాటు

Published : Jun 04, 2022, 07:15 AM IST
సల్మాన్ ఫై నెటిజన్ల ట్రోలింగ్...అభిమాని అమ్మ ఫోటో ఇచ్చినా.. అంత చిరాకు ఎందుకు అంటూ మండిపాటు

సారాంశం

అతి చేసి స్టార్స్ ను చిరాకు పెట్టే అభిమానులు చాలా మంది ఉంటారు. కాని తమ ఫెవరెట్ స్టార్ ను కలవడానికి ఎంతసేపు అయినా ఓపిగ్గా వేచివుండేవారు లేకపోలేదు. అటువంటి అభిమాని తనను కలవడానికి వస్తే.. సల్మాన్ చూపిన బిహేవియర్ విమర్షలకు దారి తీస్తుంది.   

తమ అభిమాన తారలు చూడటానికి ఫ్యాన్స్ సెలబ్రిటీ స్టార్స్ ను చుట్టు ముట్టడం కామన్. అంతే కాదు.. ఎటువంటి హడావిడి లేకుండా తాము ప్రాణంగా భావించే హీరోల కోసం పరితపిస్తూ.. వారిని కలవాలని ఎదురు చూస్తుంటారు అభిమానులు. అటువంటి ఓ అభిమాని తన అభిమాన స్టార్ సల్మాన్ ఖాన్ ను కలవడానికి ఎయిర్ పోర్ట్ కు వచ్చాడు. ఆయన కోసం ఓ మంచి గిఫ్ట్ కూడా తీసుకొచ్చాడు. కాని సల్మాన్ ఖాన్ తన అభిమానిని రిసీవ్ చేసుకున్న విధానమే విమర్శలకు దారి తీస్తోంది. 

సెలబ్రెటీలు ముఖ్యంగా హీరోలు హీరోయిన్స్ బయటకు వెళ్లినప్పుడు అభిమానులు పదుల సంఖ్యలో చుట్టుముట్టడం అనేది చాలా కామన్ విషయం. అలా చుట్టుముట్టిన సమయంలో మొహం చిరాకుగా పెట్టుకోవడం.. ఇబ్బంది పడుతున్నట్లు గా మొహం పెట్టుకోవడం జరుగుతుంది. కాని సల్మాన్ ఖాన్ తాజాగా ఉన్నది ఒకే ఒక్క అభిమాని అయినా కూడా అతనితో ఫోటో దిగేందుకు చాలా చిరాకుగా మొహం పెట్టాడు.

ముంబయి ఎయిర్ పోర్ట్ లో సల్మాన్ ఖాన్ వస్తున్న విషయం తెలిసి అక్కడ కలిసేందుకు ఒక అభిమాని నిల్చున్నాడు. అతడు సల్మాన్ తల్లితో కలిసి ఉన్న ఫోటోను పట్టుకుని గిఫ్ట్ గా ఇవ్వాలని చాలా సేపు ఎదురుచూశాడు. అది కూడా సల్మాన్ చాలా రేర్ ఫోటో ను పట్టుకుని ఉన్న ఆ అభిమాని అక్కడ ఉన్న వారి అందరి దృష్టిని ఆకర్షించాడు. కాని విచిత్రం ఏంటీ అంటే ఆ అభిమానిని, ఆ ఫోటోను సల్మాన్ ఖాన్  మాత్రం చాలా లైట్ తీసుకున్నాడు. అమ్మ ఫోటో ను పట్టుకుని ఉన్న అభిమానిని అభినందించడం తరువాత మాట.. కనీసం నవ్వుతూ కూడా పలకరించలేదు.

 

ఒక అభిమాని తల్లి ఫోటో ను అది కూడా ఒక పాత జ్ఞాపకంను తీసుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ గా రియాక్ట్ అవ్వాలి. కాని సల్మాన్ అలా కాకుండా చిరాకుగా ఉండటం అందరికి ఆశ్చర్యం ను కలిగించింది. ఎంత చిరాకులు ఉన్నా.. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అభిమానులతో ఒక ఫోటో అంటే కనీసం చిన్న చిరునవ్వు అయినా మొహం పై చూపించాలి. చాలా మంది స్టార్స్ ఎంత ఇబ్బందిలో ఉన్నా.. అభిమానుల వస్తే.. వారి కోసం టైమ్ కేటాయిస్తారు.. చిరునవ్వుతో పలకరిస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్లు ఈ స్థాయిలో ఉండటానికి అభిమానులే కదా కారణం.

ఇండియన్ స్టార్ హీరో  సల్మాన్ ఖాన్ ను కలవడానికి అభిమాను ఆ టైమ్ లో అంతసేపు వెయిట్ చేసి.. అది కూడా తనకు మెమోరబుల్ గిఫ్ట్ తీసుకునివస్తే.. కనీసం చిన్న చిరునవ్వు కూడా ఇవ్వకపోవడం విమర్షలకు దారి తీస్తుంది. ఆయనకు ఎంత చిరాకు ఉన్నా.. నవ్వుతూ పలకరించడం అనేది పెద్ద కష్టం కాదు. కాని కనీసం నవ్వినట్లుగా కూడా నటించకుండా అంతే చిరాకుగా మొహం పెట్టాడు. అభిమాని అమ్మ ఫోటో ఇస్తున్నప్పుడు కనీసం ఆ ఫోటును సల్మాన్ పట్టుకోలేదు. చూడటానికి కూడా ఇష్టపడలేదు.  ఆ అభిమాని ఆ ఫోటోను పట్టుకుని సల్మాన్ తో కలిసి ఫోటో దిగి అక్కడ నుండి వెళ్లి పోయాడు. 

ఇక ఈ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. సల్మాన్ ఏ హడావిడిలో ఉన్నాడో అంటూ ఆయనను సపోర్ట్ చేసేవారు అంటుంటే.. ఎంత హడావిడిలో ఉన్నా.. అభిమానుల దగ్గర అలా ఉండొచ్చా అని మరికొంత మంది అంటున్నారు. అంతే కాదు...అమ్మ ఫోటో ఇస్తున్నా కూడా అంత చిరాకు ఎందుకు సల్లూ భాయ్ అంటూ అభిమానులు సైతం సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..