Salman in God Father: `గాడ్‌ ఫాదర్‌` లోకి ఎంట్రీ ఇచ్చిన సల్మాన్‌.. స్వాగతం పలికిన చిరు

Published : Mar 16, 2022, 09:38 AM IST
Salman in God Father: `గాడ్‌ ఫాదర్‌` లోకి ఎంట్రీ ఇచ్చిన సల్మాన్‌.. స్వాగతం పలికిన చిరు

సారాంశం

ఈ యుగంలో అరుదైన ఘటన. టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి, బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కలిసి నటించబోతుండటం. తాజాగా సల్మాన్‌ సెట్‌లోకి ఎంట్రీ ఇవ్వడం వైరల్‌గా మారింది. 

తెలుగు సినిమాలో మరో సంచలనానికి తెరలేచింది. ఇద్దరు అగ్రనటులు కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారు. బాలీవుడ్‌లో అగ్ర హీరోగా రాణిస్తున్న సల్మాన్‌ ఖాన్‌(Salman Khan), టాలీవుడ్‌లో మెగాస్టార్‌గా ఉన్న చిరంజీవి(Chiranjeevi) కలిసి నటించబోతున్నారు. వీరిద్దరికి `గాడ్‌ ఫాదర్‌` మూవీ వేదిక కాబోతోంది. మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి `గాడ్‌ ఫాదర్‌`(God Father) చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నటించబోతున్నట్టు గతంలోనే అటు సల్మాన్‌, ఇటు చిరంజీవి తెలిపారు. తాజాగా `గాడ్‌ ఫాదర్‌` సెట్‌లోకి సల్మాన్‌ ఎంట్రీ ఇచ్చారు. బుధవారం రోజు ఆయన సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సల్మాన్‌కి స్వయంగా చిరంజీవి స్వాగతం పలకడం విశేషం. 

ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. `భాయ్‌ సల్మాన్‌ ఖాన్‌ `గాడ్‌ ఫాదర్‌` మీకు స్వాగతం పలుకున్నారు. మీ రాక ప్రతి ఒక్కరినీ ఉత్తేజ పరిచింది. ఉత్సాహానికి నెక్ట్స్ లెవల్‌కి చేరుకుంది. మీతో స్క్రీన్‌ని పంచుకోవడం ఒక సంపూర్ణమైన అనందం. మీ ప్రజెన్స్ ప్రేక్షకులకు అద్భుతమైన కిక్‌ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు` అంటూ సల్మాన్‌కి స్వాగతం పలుకున్న ఫోటోని అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి. ప్రస్తుతం ఇది ట్విట్టర్‌లో వైరల్‌ అవుతుంది. ఈ విషయాన్ని యూనిట్‌ చెబుతూ ఈ యుగంలో అరుదైన విషయం. ఇద్దరు లెజెండ్స్ కలిసిన సందర్బం అంటూ సల్మాన్‌ ఎంట్రీని తెలిపింది. 

మరోవైపు ఈ చిత్రంలో కీలక పాత్రలో సత్యదేవ్‌, రవితేజలు కూడా నటించబోతున్నాయి. అయితే వీరి జస్ట్ గెస్ట్ రోల్స్ కి ఎక్స్ టెండెడ్‌గా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఈ సినిమా మలయాళంలో రూపొందిన `లూసీఫర్‌`కి రీమేక్‌. మాతృకలో మోహన్‌లాల్‌ నటించారు. ఆ పాత్రని చిరంజీవి చేస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యో అరెస్ట్- ఉలుకుపలుకు లేకుండా పడిపోయిన సుమిత్ర-నోరు జారిన పారు
Mowgli Movie Review: మోగ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుమ కనకాల కొడుక్కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?