ప్రేయసితో ఘనంగా అర్భాజ్ ఖాన్ పెళ్లి.. తమ్ముడి వివాహ వేడుకలో చిందులేసిన సల్మాన్, మలైకా సంగతేంటి..

By tirumala AN  |  First Published Dec 25, 2023, 10:16 AM IST

సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. వైభవంగా జరిగిన వివాహ వేడుకలో అర్భాజ్ ఖాన్, షూరా ఖాన్ ఒక్కటయ్యారు. 


సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. అర్భాజ్ ఖాన్ గతంలో బోల్డ్ బ్యూటీ మలైకా అరోరాని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళకి ఒక కొడుకుపుట్టి దాదాపు 19 ఏళ్ల దాంపత్య జీవితం గడిచాక విడాకులు తీసుకోవడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. 1998లో వివాహం చేసుకున్న మలైకా అర్భాజ్ ఖాన్ 2017లో విడిపోయారు. 

ఆ తర్వాత అర్భాజ్ ఖాన్ షూరా ఖాన్ అనే మోడల్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ తో ప్రేమలో పడ్డాడు. చాలా కాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. అయితే తమ రిలేషన్ ని వీరిద్దరూ నేడు అఫీషియల్ చేశారు. వైభవంగా జరిగిన వివాహ వేడుకలో అర్భాజ్ ఖాన్, షూరా ఖాన్ ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది. 

Latest Videos

షూరా ఖాన్ బాలీవుడ్ లో చాలా మంది సెలెబ్రెటీలకు మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. జెనీలియా, రవీనా టాండన్ లాంటి సెలెబ్రెటీలకు షూరా మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. అర్భాజ్, షూరా వివాహ వేడుకకి సోదరులు సల్మాన్, సోహైల్ హాజరయ్యారు. అంతేకాదు వీరంతా వివాహ వేడుకలో చిందులు వేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అర్భాజ్, షూరా వెడ్డింగ్ పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. 

అర్భాజ్ ఖాన్ బాలీవుడ్ లో నటుడిగా, నిర్మాతగా రాణించారు. అర్భాజ్ ఖాన్ పెళ్లి జరగడంతో ఇప్పుడు మలైకా గురించి నెటిజన్లు చర్చిస్తున్నారు. అర్భాజ్ తో విడిపోయే సమయానికే ఆమె తనకంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తోంది. ఇప్పటికి వీళ్ళిద్దరూ పబ్లిక్ గా తిరుగుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. 

★ ADORING… Dancing on at ’s Wedding!

-Dec 24, 2023https://t.co/O9rgzDWGkC pic.twitter.com/aliMrhQTey

— SalmanKhanHolics.com (@SalmanKhanHolic)

మాల్దీవులకు వెళ్లడం, సన్నహితంగా ఉండే ఫొటోస్ షేర్ చేయడం లాంటివి చేస్తున్నారు. అయితే పెళ్లి సంగతి మాత్రం తేల్చడం లేదు. అర్భాజ్ ఖాన్ పెళ్లి జరగడంతో మలైకా సంగతేంటి అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. 

 

click me!