ఇంత కర్రెగా ఉన్నాడు వీడు హీరో ఏంటి అన్నారు.. ట్రోల్స్ పై సుమ కొడుకు రోషన్‌ సంచలన వ్యాఖ్యలు.. యాంకర్‌ ఎమోషనల్‌

Published : Dec 25, 2023, 09:52 AM ISTUpdated : Dec 25, 2023, 10:56 AM IST
ఇంత కర్రెగా ఉన్నాడు వీడు హీరో ఏంటి అన్నారు.. ట్రోల్స్ పై సుమ కొడుకు రోషన్‌ సంచలన వ్యాఖ్యలు.. యాంకర్‌ ఎమోషనల్‌

సారాంశం

తనపై వచ్చే ట్రోల్స్ పై యాంకర్‌ సుమ కొడుకు రోషన్‌ రియాక్ట్ అయ్యాడు. `బబుల్‌ గమ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అదిరిపోయే సమాధానం చెప్పాడు. దెబ్బకి సుమ కన్నీళ్లు పెట్టుకుంది. 

యాంకర్‌ సుమ కొడుకు రోషన్‌ హీరోగా పరిచయం అవుతూ `బబుల్‌గమ్‌` అనే సినిమాలో నటిస్తున్నారు. మానస హీరోయిన్‌గా చేస్తుంది. రవికాంత్‌ పేరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 29న రిలీజ్‌ కాబోతుంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడవిశేష్‌, సిద్దు జొన్నలగడ్డ వంటి వారు గెస్ట్ లుగా వచ్చారు. ఇందులో రోషన్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ట్రోల్స్ పై ఆయన స్పందన ఆశ్చర్యపరిచింది. 

తనపై నల్లగా ఉన్నావనే కామెంట్లు వచ్చాయట. తనని చాలా ట్రోల్‌ చేస్తున్నారని, రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారని, కర్రగా ఉన్నాడు వీడు హీరో ఏంటి? అసలు వీడు హీరో మెటీరియలే కాదు అంటూ దారుణంగా మాట్లాడుకున్నారట. తాను స్వయంగా తన వెనకాల మాట్లాడుకోవడం విన్నాడట. అంతేకాదు సోషల్‌ మీడియాలో చూశానని, ఆర్టికల్స్ చదివానని వెల్లడించారు. ఈ సందర్భంగా అదిరిపోయే కౌంటర్లు ఇచ్చాడు. 

కర్రగా ఉన్నానా?, తెల్లగా ఉన్నానా అనేది మ్యాటర్‌ కాదని ఇక్కడ టాలెంట్‌ ముఖ్యం అని చెప్పాడు రోషన్‌. ఆయన మాట్లాడుతూ, నేను చాలా సార్లు విన్నాను, నా వెనకాల మాట్లాడటం చూశాను, చాలా చదివాను. అరే వీడు హీరో, వీడేంటి మస్త్ కర్రగా ఉన్నాడు వీడు హీరో ఏంటి? హీరో మొఖం కాదు, బొక్క వేస్ట్ హీరో మెటీరియల్‌ కాదు అన్నారు. నేను ఇలానే పుట్టాను. ఇలానే ఉంటా. ఒక మనిషికి నలుపు, తెలుపు, అందం కాదు బ్రదర్‌ సక్సెస్‌ ని డిసైడ్‌ చేసేది. ఆ మనిషి హార్డ్ వర్క్, టాలెంట్‌, డిసిప్లెయిన్‌ మాత్రమే నిర్ణయిస్తుంది. 

మన అందరి జాతకంలో ఏం రాసి పెట్టిందో ఎవరికీ తెలియదు. కానీ నచ్చినట్టు మార్చుకుంటాం. కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటాం. అది ఇజ్జత్‌ అయినా, ఔకాద్‌ అయినా, ఒక రోజు వస్తది, వద్దనుకున్నా వినబడతా, చేవులు మూసుకున్నా వినబడతా. డిసెంబర్‌ 29న రాసిపెట్టుకోండి, థియేటర్‌కి వచ్చేయండి. ఆది గాడి లవ్‌ని చూడండి, ఆదిగాడి ఫైట్‌ ఫర్‌ రెస్పెక్ట్ ని చూడండి` అంటూ తనదైన స్టయిల్‌లో డేరింగ్‌గా అదిరిపోయే సమాధానం చెప్పాడు. అయితే కొడుకు మాట్లాడుతుంటే వెనకాల యాంకర్‌ సుమ ఎమోషనల్‌ అయ్యింది. ఆమె గర్వంతో కన్నీళ్లు పెట్టుకుంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

రెండో భార్యతో కూడా దర్శకుడు విడాకులు ? మొన్న తమ్ముడు, ఇప్పుడు అన్న.. ఫోటోలు డిలీట్ చేసిన భార్య
Demon Pavan: రీతూ కంటే వాళ్లిద్దరూ హౌస్ లో ఉండడమే పవన్ కి ఇష్టమా.. తనూజపై నమ్మకం లేదంటూ..