షారూఖ్‌ కోసం నాల్గోసారి వస్తున్న కండల వీరుడు.. మ్యాజిక్‌ వర్కౌట్‌ అవుతుందా?

Published : Nov 08, 2020, 09:53 AM IST
షారూఖ్‌ కోసం నాల్గోసారి వస్తున్న కండల వీరుడు.. మ్యాజిక్‌ వర్కౌట్‌ అవుతుందా?

సారాంశం

షారూఖ్‌ సినిమాలో సల్మాన్‌ గెస్ట్ గా మెరవబోతున్నారు. ఇప్పటికే షారూఖ్‌ హీరోగా వచ్చిన `కుచ్‌ కుచ్‌ హోతా హై`, `ఓంశాంతి ఓం`, `జీరో` చిత్రాల్లో సల్మాన్‌ గెస్ట్ గా మెరిసి అలరించారు. 

రెండేళ్ళ గ్యాప్‌తో మళ్లీ మేకప్‌ వేసుకోబోతున్నారు బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌. ఆయన `బ్యాంగ్‌ బ్యాంగ్‌`, `వార్‌` చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో `పఠాన్‌` చిత్రంలో నటించబోతున్నారు. ఈ నెలలోగానీ, డిసెంబర్‌లోగానీ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. ఇందులో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటించబోతుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే `ఓం శాంతి ఓం`, `చెన్నై ఎక్స్ ప్రెస్‌`, `హ్యాపీ న్యూ ఇయర్‌` చిత్రాల్లో నటించారు. ఇప్పుడు నాల్గో సారి రొమాన్స్ చేయబోతున్నారు. 

ఇందులో జాన్‌ అబ్రహం విలన్‌గా నటించబోతున్నట్టు తెలుస్తుంది. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ నిర్మించబోతున్న ఈ సినిమాలో సల్మాన్‌ గెస్ట్ గా మెరవబోతున్నారు. ఇప్పటికే షారూఖ్‌ హీరోగా వచ్చిన `కుచ్‌ కుచ్‌ హోతా హై`, `ఓంశాంతి ఓం`, `జీరో` చిత్రాల్లో సల్మాన్‌ గెస్ట్ గా మెరిసి అలరించారు. తాజాగా నాల్గోసారి సల్మాన్‌ మెరవబోతున్నట్టు తెలుస్తుంది. అతిథి పాత్ర కోసం ఆయన్ని సంప్రదించగా, వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 

ఇదిలా ఉంటే సల్మాన్‌ నటించిన `హర్‌ దిల్‌ జో ప్యార్‌ కరేగా`, `ట్యూబ్‌లైట్‌` చిత్రాల్లో షారూఖ్‌ అతిథిగా మెరిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్‌ `రాధే` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది