
అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానులే కాదు సినీ ప్రముఖులు కూడా భాయ్ ఓ ఇంటివాడు ఎప్పుడు అవుతాడో అని ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు షారుక్ ఖాన్, రాణీ ముఖర్జీ తదితరులు.. సల్మాన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని వివిధ సందర్భాల్లో ప్రశ్నించారు. కాగా సల్మాన్ తన బ్రహ్మచారి జీవితానికి స్వస్తి పలుకుతున్నాడనేలా... ఆయన మంగళవారం ‘నాకు అమ్మాయి దొరికింది’ అంటూ హిందీలో ట్వీట్ చేశారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అయ్యారు. చాలా సంతోషిస్తూ తెగ కామెంట్స్ చేశారు. ఆ అమ్మాయి ఎవరు? అనేది ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విషయం కూడా భాయ్ చెబితే తెలుసుకోవాల్సిందే.
రొమేనియన్ మోడల్ ఉలియా వంతూర్‌తో సల్మాన్ ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆమె కూడా అనేక సందర్భాల్లో ఆయనతో కలిసి బయట కనిపించారు. అంతేకాదు సల్మాన్ కుటుంబసభ్యులను కూడా కలిశారు. దీంతో వీరిద్దరి వివాహం నిశ్చయమైందంటూ వార్తలు వచ్చాయి. ఈ ప్రచారంపై సల్మాన్ స్పష్టత ఇవ్వలేదు. కానీ ఉలియా మాత్రం సల్మాన్ కుటుంబంతో తనకు మంచి బంధం ఉందని ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
సల్మాన్ ఇటీవల ‘టైగర్ జిందా హై’ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.340 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు తెలిపారు. కత్రినా కైఫ్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి అలీ అభ్బాస్ జఫర్ దర్శకత్వం వహించారు. సల్మాన్ ప్రస్తుతం ‘రేస్ 3’ సినిమా చిత్రీకరణకు సిద్ధమౌతున్నారు. ఇందులో అనిల్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇక తాజాగా సల్మాన్ కు దొరికిన అమ్మాయి ఎవరా అంటే.. వరీనా హుస్సేన్. ఈమె అయుష్ శర్మ తెరకెక్కిస్తున్న లవ్ రాత్రి అనే సినిమాలో హిరోయిన్ గా దొరికకిందట. సల్మాన్ అమ్మాయి దొరికిందంటూ చేసిన ట్వీట్ పై సస్పెన్స్ ఎత్తివేస్తూ.. వరీనా హుస్సేన్ ఫోటోతో మరో ట్వీట్ చేశాడు. దొరికింది ఆయుష్ సినిమాకు హిరోయిన్ వరీనా. సో డోంట్ వరీనా. బీ హేపీనా అంటూ సల్మాన్ వెరైటీగా ట్వీట్ చేశాడు.