బాలు కోలుకోవాలని సల్మాన్‌ ఎమోషనల్‌ ట్వీట్‌.. తమన్‌ స్పెషల్‌ వీడియో

Published : Sep 25, 2020, 10:19 AM ISTUpdated : Sep 25, 2020, 10:23 AM IST
బాలు కోలుకోవాలని సల్మాన్‌ ఎమోషనల్‌  ట్వీట్‌.. తమన్‌ స్పెషల్‌ వీడియో

సారాంశం

కమల్‌ హాసన్‌ ఆసుపత్రికి చేరుకుని బాలుని పరామర్శించారు. మరోవైపు బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ సైతం కోలుకోవాలని వేడుకుంటున్నారు.

లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఎంజీఎం హాస్పిటల్‌ వైద్యులు వెల్లడించారు. ఎక్మో ట్రీట్‌ మెంట్‌ ఇస్తున్నట్టు తెలిపారు. ఆయన వైద్యానికి స్పందించడం లేదని స్పష్టమవుతుంది. 

ఈ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం బాలు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఆయన
కోలుకోవాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే కమల్‌ హాసన్‌ ఆసుపత్రికి చేరుకుని బాలుని పరామర్శించారు. మరోవైపు బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ సైతం కోలుకోవాలని వేడుకుంటున్నారు.

`బలసుబ్రమణ్యం సర్‌..త్వరగా మీరు కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవుడిని ప్రార్థిస్తున్నా. నా కోసం ఎన్నో పాటలు పాడి నన్ను ఎంతో స్పెషల్‌గా మార్చినందుకు ధన్యవాదాలు. మీ `దిల్‌ దివానా హీరో ప్రేమ్‌.. లవ్‌ యూ సర్‌` అని ట్వీట్‌ చేశారు. 

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం బాలు ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌.తమన్‌ ఓ స్పెషల్‌ వీడియోని పంచుకున్నారు. `లాక్‌డౌన్‌కి ముందు మార్చి నెలలో నాకెంత్‌ ప్రియమైన మామాతో మేమంతా సరదాగా గడిపాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగడంలేదు. మామా దయజేసి త్వరగా కోలుకోండి. ఆయన ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించండి` అని ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. వీరితోపాటు హరీష్‌ శంకర్‌, రాధిక, ఖుష్బు, గీతా మాధురి, మంచు లక్ష్మీ, చిన్మయి, ప్రసన్న వంటి అనేక మంది తారలు బాలు కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్‌ చేస్తున్నారు.

 

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం